Thandel: అక్కినేని నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా నటించిన తాజా చిత్రం తండేల్. గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహించారు. ఈ సినిమా శ్రీకాకుళానికి చెందిన ఒక మత్స్యకారుడి జీవిత ఆధారంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫిబ్రవరి 7వ తేదీ విడుదలైన ఈ చిత్రం నాగచైతన్య కెరియర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది అని చెప్పాలి.
ఇక ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ రాబట్టి మంచి టాక్ సొంతం చేసుకున్న నేపథ్యంలో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇక బుక్ మై షో లో కూడా ఈ సినిమాకు గంటకు 16 వేల వరకు టికెట్లు అమ్ముడుపోతున్నాయి ఇలాగే ఇదే జోరు కనబరిస్తే ఈ మూడు రోజులలోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావటం ఖాయమని నిర్మాతలు భావిస్తున్నారు. ఇలా ఈ సినిమా విడుదలయ్యి మంచి టాక్ సొంతం చేసుకుని దూసుకుపోతున్న నేపథ్యంలో ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది..
తండేల్ మూవీ ని మేకర్స్ మా మనోభావాలు దెబ్బతినేలా తీశారంటూ శ్రీకాకుళం మెకనైజ్డ్ బోట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జానకి రామ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తండేల్ సినిమాని నిజ జీవిత కథ ఆధారంగా చేస్తున్నట్లు వెల్లడించారు. కానీ ఈ సినిమా స్టోరీ పూర్తిగా అవాస్తవం. పాకిస్థాన్ లో చిక్కుకున్న 22 మంది జాలరులను అప్పటి ముఖ్య మంత్రి జగన్ గారు ఎంతో కష్టపడి విడిపించారు. ఈ స్టోరీని సినిమాలో చూపించకుండా, ప్రేమకథని చూపిస్తారా?, ఇదెక్కడి న్యాయం?, ఈ కథ మాజీ సీఎం జగన్ గారిది. ఆయనే నిజమైన తండేల్. వాస్తవాలను కప్పేసి తీసిన ఈ చిత్రాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము.
ఈ సినిమాలో జగన్మోహన్ రెడ్డి గారు మాకు చేస్తున్న సహాయం గురించి కూడా ఎక్కడ చూపించలేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇక ఈ విషయంలో వైసిపి అభిమానులు కూడా అసలు తగ్గేది లేదంటున్నారు అల్లు అరవింద్ నోటి వెంట తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు వచ్చేవరకు వదిలేది లేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.