TG: పద్ధతి మార్చుకో రేవంత్…. ఎమ్మెల్యేల ముందే సీఎంకు హెచ్చరించిన కోమటిరెడ్డి?

TG: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సొంత నేతల నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకత ఏర్పడుతుంది. తాజాగా సొంత పార్టీ ఎమ్మెల్యేల ముందు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేస్తూ రేవంత్ విధివిధానాలను మార్చుకోవాలి అంటూ సూచించినట్టు తెలుస్తుంది.

ఈ నేపథ్యంలో నిన్న నిర్వహించిన సీఎల్పీ భేటీలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ టార్గెట్ గా ఫైర్ అయ్యారు. ఏకపక్ష నిర్ణయాలు ఏంటని ఆయన ప్రశ్నించారు. ముఖ్యంగా ప్రభుత్వం అందచేస్తున్నటువంటి పథకాలకు అప్లికేషన్ తీరుపై రాజగోపాల్ మండిపడ్డారు.అందరికీ ఇళ్లు, రేషన్ కార్డులు ఇవ్వలేని పరిస్థితి ఉంటే.. జాబితాలు విడుదల చేయడం ఏంటని ప్రశ్నించినట్లు సమాచారం. ప్రభుత్వం దగ్గర పైసలు లేకుంటే కొత్త స్కీమ్స్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నారని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు.

ఇకపోతే ప్రస్తుత మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని వెల్లడించారు ఇక గ్రామాలలో రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయని కనీసం చిన్న చిన్న కాంట్రాక్టర్లకు కూడా బిల్లులు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నామని తెలిపారు. ఇక ఇప్పటివరకు ఇచ్చిన సంక్షేమ పథకాలు కూడా పూర్తిస్థాయిలో అందరికీ అందకపోవడంతో ప్రజలందరూ కూడా వ్యతిరేకత చూపిస్తున్నారని రాజగోపాల్ తెలిపారు.

చాలామంది కెసిఆర్ పాలనే బాగుంది అనే స్థాయికి వచ్చారని రాజగోపాల్ తెలిపారు. ఇలా సొంత పార్టీ నేత అయినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రేవంత్ రెడ్డి తీరుపై పూర్తి స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు అయితే ఈయన అసంతృప్తి వ్యక్తం చేయడానికి కూడా కారణం లేకపోలేదని చెప్పాలి ఎంపీ ఎన్నికలలో చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే తనకు మంత్రి పదవి ఖాయం అంటూ రేవంత్ రెడ్డి మాట ఇచ్చారట అందుకోసమే ఆయన కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం ఎంతో కష్టపడినా రేవంత్ రెడ్డి మాత్రం తన మాటను నిలబెట్టుకోలేకపోవడంతోనే ఈ అసంతృప్తి వ్యక్తం అవుతుందని తెలుస్తోంది.