Allu Vs Mega : మెగా కాంపౌండ్ నుంచి ‘అల్లు’ క్యాంప్ వేరుపడిందా.? మెగాస్టార్ చిరంజీవికి దూరంగా అల్లు అరవింద్ కుటుంబం జరుగుతోందా.? సినీ వర్గాల్లో గత కొద్ది రోజులుగా ఈ అంశంపై జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. మీడియాలో ఎప్పటికప్పుడు అల్లు వర్సెస్ మెగా.. అంటూ డిస్కషన్లు, గాసిప్స్ కనిపిస్తున్నాయి.
అయితే, ‘మెగా కాంపౌండ్’ నుంచి ‘అల్లు కుటుంబాన్ని’ వేరు చేయలేం.. అన్న భావన ఇటు మెగా అటు అల్లు అభిమానుల నుంచి వ్యక్తమవుతోంది. ఆయా హీరోల సినిమాల రిలీజ్ సమయాల్లో అభిమానుల అత్యుత్సాహం, కొందరు దురభిమానుల పైత్యం కారణంగానే ఈ ‘గ్యాప్’ క్రియేట్ అవుతూ వస్తోందన్నది నిర్వివాదాంశం.
అల్లు అరవింద్‌కి సంబంధించిన ‘ఆహా’ కోసం అల్లు అర్జున్ పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. అయితే, ఆ ‘ఆహా’లో నందమూరి బాలకృష్ణకు దక్కుతున్న ప్రాధాన్యత చూశాక, చిరంజీవిని పూర్తిగా అరవింద్ పక్కన పెట్టారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదంతా నిజమేనా.? అంటే, కాదన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
తెలుగు సినిమా స్థాయి పెరిగింది. అదే సమయంలో కోవిడ్ నేపథ్యంలో సినీ పరిశ్రమ తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది. దాంతో, హీరోల మధ్య ఒకప్పుడు వున్నాయనుకుంటున్న బేదాభిప్రాయాలు ఇప్పుడు కనిపించడంలేదు. తెలుగు సినిమా కోసం అందరూ కష్టపడుతున్నారిప్పుడు. పాన్ ఇండియా సినిమాలే కాదు, మల్టీస్టారర్ సినిమాలొస్తున్నాయి.. అవీ షాకింగ్ కాంబినేషన్లతో.
ఏమో, సమీప భవిష్యత్తులో బాలకృష్ణ – చిరంజీవి కలిసి నటించే సినిమాకి అల్లు అరవింద్ నిర్మాత కాబోతున్నారేమో.! అన్ స్టాపబుల్ కార్యక్రమంలో చిరంజీవి కనిపించకపోవడంతో వినిపించిన రూమర్లకు అల్లు అరవింద్ మెగా – నందమూరి కాంబోతో చెక్ పెడితే అంతకన్నా కావాల్సిందేముంది.?