కొవ్వు క‌రిగిస్తున్న అల్లూ వార‌బ్బాయి.. వైర‌ల్‌గా మారిన వీడియో

టాలీవుడ్ మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ నిర్మాత‌గా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు అద్భుత‌మైన సినిమాలు తీసుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న నిర్మించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పెద్ద విజ‌యం సాధించాయి. అయితే ఈయ‌న‌కు ముగ్గురు కొడుకులు కాగా, పెద్ద కొడుకు ప్ర‌స్తుతం నిర్మాత‌గా స‌త్తా చాటే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. రెండో కొడుకు అల్లు అర్జున్ తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోగా తండ్రి పేరు నిల‌బెట్టాడు. ఇక చిన్న కొడుకు అల్లు శిరీష్ హీరోగా ప‌లు సినిమాలు చేయ‌గా, అవి పెద్ద‌గా అల‌రించ‌క‌పోవ‌డంతో ఇంకా త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు.

గౌర‌వం అనే సినిమాతో హీరోగా తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు పెట్టిన అల్లు శిరీష్ ఆ త‌ర్వాత కొత్త జంట‌, శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు, 1971-బియాండ్ బోర్డ‌ర్స్, ఒక్క క్ష‌ణం, ఏబీసీడీ అనే చిత్రాలు చేశాడు. వీటిలో కొత్త జంట అనే చిత్రం ప‌ర్వాలేద‌నిపించింది. అయితే ప్ర‌స్తుతం ఓ మంచి హిట్ కొట్టాల‌ని క‌సిగా ప‌ని చేస్తున్న అల్లు శిరీష్ ప‌లు క‌థ‌ల‌ను వింటున్న‌ట్టు తెలుస్తుంది . త‌న అన్న అల్లు అర్జున్ మాదిరిగా ఇండ‌స్ట్రీలో మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందేందుకు కృషి చేస్తున్నాడు. రీసెంట్‌గా కండ‌లు పెంచేందుకు క‌స‌ర‌త్తులు చేస్తుండ‌గా, దానికి సంబంధించిన వీడియోను ట్విట్ట‌ర్‌లో షేర్ చేశాడు.

అల్లు శిరీష్ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుండ‌గా, ఆయ‌న క‌ష్టాన్ని చూసి అభిమానులు అవాక్క‌వుతున్నారు. ఇక ఇదిలా ఉంటే అల్లు శిరీష్ సోద‌రుడు అల్లు అర్జున్ ..సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతుంది. ప‌లు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగ‌స్ట్ య‌13న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా ర‌ష్మిక మంధాన న‌టిస్తుండ‌గా, దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు.

https://twitter.com/AlluSirish/status/1360461821602324480