Balakrishna: మెగా హీరోపై సెటైర్స్ వేసిన బాలయ్య బాబు.. అందుకే ఆ మూవీ అట్టర్ ఫ్లాప్ అంటూ!

Balakrishna: టాలీవుడ్ హీరో నందమూరి నరసింహ బాలయ్య బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలకృష్ణ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. వరుస సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు బాలయ్య బాబు. గత నాలుగు సినిమాలతో నాలుగు వరస విజయాలను తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. అఖండ సినిమా నుంచి వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ సినిమాలతో సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు బాలకృష్ణ. ఇప్పుడు మరో సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు.

గతంలో విడుదల అయిన అఖండ 2 సినిమా సీక్వెల్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెల కొన్నాయి. ఈ సినిమా కోసం ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు బాలయ్య బాబు ఫ్యాన్స్. ఈ చిత్రం కూడా తప్పకుండా సక్సెస్ అవుతుందని బాలయ్య బాబు అభిమానులు చెబుతున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా బాలయ్య చేసిన వాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఒక ఈవెంట్ లో బాలకృష్ణ మెగా హీరోకి ఇచ్చిన కౌంటర్ వైరల్ గా మారింది.

ఈ సందర్భంగా బాలయ్య తన చిత్రం గురించి తానే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈవెంట్ లో అల్లు శిరీష్ బాలయ్య వద్దకు వెళ్లి ప్రశ్నిస్తూ.. మీరు చేసిన చిత్రాల్లో సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, లక్ష్మీ నరసింహ, సింహా, జైసింహా, వీర సింహారెడ్డి సింహా అనే టైటిల్ తో వచ్చాయి. ఇవి కాకుండా మరో చిత్రాన్ని కూడా మీరు సింహా టైటిల్ తో చేశారు. ఆ చిత్రం ఏంటి అని అల్లు శిరీష్ ప్రశ్నించారు. బాలయ్య వెంటనే బొబ్బిలి సింహం అని అన్నారు. బొబ్బిలి సింహం కాకుండా మరొకటి ఉంది అని అల్లుడు శిరీష్ తెలిపారు. దీంతో బాలయ్య అల్లు శిరీష్ కి ఫన్నీగా కౌంటర్ ఇచ్చారు. బొబ్బిలి సింహంలో సింహం కాకుండా పులి ఉందా అక్కడ. అందులో సింహం ఉంది కదయ్యా అని ఫన్నీగా కౌంటర్ ఇచ్చారు. అది కాకుండా మరొక చిత్రం ఉంది. ఆ మూవీ పేరు సింహం నవ్వింది అని అల్లు శిరీష్ తెలిపారు. బాలయ్య వెంటనే స్పందిస్తూ.. అందుకే ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అని అన్నారు. సింహం నవ్వడం ఏంటయ్యా అందుకే ఆ సినిమా పోయింది అంటూ తన సినిమా గురించి తానే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.