అకీరానందన్ బాధ్యత రామ్ చరణ్ చేతుల్లోనే.!

అకీరా నందన్‌కి సంబంధించి ఏ చిన్న వార్త వచ్చినా అదో సెన్సేషనే. ఎందుకంటే తను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు కాబట్టి. ఆరడుగుల ఆజానుబాహుడిలా ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతున్నాడు అకీరానందన్.

ఇక త్వరలోనే హీరోగా ఎంట్రీకి సిద్ధం అని మెగా అభిమానులు పిక్సయిపోయారు. అయితే, ఇంకో రెండేళ్ల తర్వాతే అకీరానందన్ సినిమాల్లోకి రాబోతున్నాడట. ప్రస్తుతం చదువుకుంటున్నాడట.

అయితే, ఓ వైపు చదువుకుంటూనే యాక్టింగ్ స్కిల్స్ కూడా నేర్చుకుంటున్నాడనీ తెలుస్తోంది. డాన్సుల్లోనూ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడట. యంగ్ హీరో మల్టీ టాలెంటెడ్ అయిన అడవిశేష్‌తో వున్న స్నేహం కారణంగా సినిమాకి సంబంధించి కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాట. అలాగే ఇంకో వైపు అన్నయ్య రామ్ చరణ్‌తోనూ బాగా ఇంటరాక్ట్ అవుతున్నాడట.

అకీరా లాంఛ్ చేసే బాధ్యత రామ్ చరణే తీసుకున్నాడనీ ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే అకీరా లాంఛ్ అయ్యే ప్రాజెక్ట్‌కి నిర్మాణం పరంగా చరణ్ కొంత భాగం ఖచ్చితంగా వుంటుందట. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ , కొణిదెల బ్యానర్‌తో కలిపి ఇంకో బ్యానర్ సంయుక్తంగా అకీరా ఫస్ట్ ప్రాజెక్ట్ నిర్మించబోతోందనీ తెలుస్తోంది.