Akshaya Tritiya: అక్షయ తృతీయ..మూడు పనులు చేస్తే అఖండమైన ఐశ్వర్యం!

Akshaya Tritiya: ప్రతి ఏడాది వైశాఖ మాసంలో శుక్లపక్షం తృతీయ తిథి రోజున వచ్చే అక్షయ తృతీయ ఎంతో పవిత్రమైన దినంగా భావిస్తాము. ఈ అక్షయ తృతీయ రోజు విష్ణుమూర్తి లక్ష్మీదేవిని పూజించడం వల్ల సకల సంపదలు కలుగుతాయని భావిస్తారు. అదేవిధంగా ఈరోజు బంగారు వెండి ఆభరణాలను కొనుగోలు చేయడం వల్ల మన ఆస్తి, సంపద పెరుగుదలకు దోహదపడుతుందని చాలామంది నేడు పెద్ద ఎత్తున బంగారు నగలను కొనుగోలు చేస్తారు.

ఈ విధంగా అక్షయ తృతీయ రోజు ఎంతో మంది బంగారు ఆభరణాలను కొనుగోలు చేసి సకల సంపదలు కలగాలని లక్ష్మీ దేవిని పూజిస్తారు. అయితే ప్రతి ఒక్కరూ బంగారం కొనే స్తోమత ఉండదు కనుక అలాంటి వారు ఈ అక్షయ తృతీయ రోజు ఈ క్రింది తెలిపిన పనులను చేయడం వల్ల అఖండమైన అష్టైశ్వర్యాలను పొందడమే కాకుండా పుణ్యక్షేత్రాలను దర్శించిన పుణ్యఫలం కలుగుతుంది. మరి ఆ మూడు విషయాలు ఏమిటి అనే విషయానికి వస్తే…

అక్షయ తృతీయ రోజు ఎవరైతే జల దానం చేస్తారో అలాంటి వారికి సకల పుణ్యక్షేత్రాలు సందర్శించిన పుణ్య ఫలం దక్కుతుంది. అందుకే అక్షయ తృతీయ రోజు కలశంలో నీటిని నింపి దానం చేయడం ఎంతో మంచిది. అలాగే అక్షయ తృతీయ రోజు మహాలక్ష్మితో పాటు విష్ణుమూర్తిని కూడా పూజించాలి.

అక్షయ తృతీయ రోజు ఎవరైతే బంగారం కొనలేని స్తోమత ఉంటుందో అలాంటి వారు బార్లీ గింజలను కొనుగోలు చేసిన అద్భుతమైన పుణ్య ఫలం కలుగుతుంది.అలాగే నేడు బార్లీ గింజలను దానం చేయడం వల్ల సాక్షాత్తు బంగారం దానం చేసిన పుణ్యఫలం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.

అక్షయ తృతీయ రోజు మన పూర్వీకులను పూజించడం మర్చిపోకూడదు. నేడు మన పూర్వీకులను పూజించే నమస్కరించుకోవడం వల్ల పెద్ద వారి ఆశీస్సులు ఎల్లప్పుడు మన పై ఉండి మనకు సంతోషకరమైన జీవితాన్ని ప్రసాదిస్తారు. ఈ మూడు పనులను తప్పనిసరిగా చేయటం వల్ల సకల సంపదలు లభిస్తాయి.