Ntr – Anr: ఏఎన్ఆర్ పేరు కూడా పెట్టండి…డిమాండ్ చేస్తున్న అక్కినేని అభిమానులు.?

Ntr – Anr: ప్రస్తుతం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాట్లు జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే. ఈ కొత్త జిల్లాల ఏర్పాటను వీలైనంత త్వరగా పూర్తి చేయాలి అని ఏపీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే 13 జిల్లాలను 26 జిల్లాల ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఏపీలో ప్రస్తుతం కొత్త జిల్లాలు ఏర్పాటు ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. అయితే ఏపీ సీఎం జగన్ ఒక జిల్లాకు ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టడంతో ఏఎన్నార్ అభిమానులు ఏఎన్ఆర్ జిల్లా అని కూడా పెట్టండి అంటూ అభిమానులు తెరపైకి తీసుకొస్తున్నారు.

అక్కినేని అభిమానులు మచిలీపట్నం జిల్లాకు ఏఎన్ఆర్ పేరు ను తీసుకు రావాలని కోరుకుంటున్నారు. అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అయిన సర్వేశ్వరరావు వారి కోరికను ఏపీ సర్కార్ గౌరవించాలి అని కోరారు. అదే విధంగా ఏఎన్ఆర్ తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్ని వందల సినిమాల్లో నటించి ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. కృష్ణా జిల్లాలోని గుడివాడ రామాపురంలో ఏఎన్ఆర్ జన్మించారు. ఏఎన్నార్ తన సినీ కెరీర్లో ఎన్నో విభిన్న పాత్రల్లో నటించి, విజయాలను సొంతం చేసుకోవడంతో పాటు సినీరంగానికి చేసిన సేవలకు అతనికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా దక్కింది.

దీనితో మచిలీపట్నం జిల్లాకు ఏఎన్ఆర్ పేరు పెడితే ఎవరు వ్యతిరేకించే వాళ్ళు లేరు. సినీరంగం హైదరాబాద్ కు రావడం లో ఏఎన్నార్ కృషి ఎంతో ఉంది. మరి అక్కినేని అభిమానుల డిమాండ్ ఈ విషయంలో ఏపీ సర్కార్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి. ఏపీలో 23 జిల్లాలు మూడు రాజధానుల నుంచి పరిపాలన మొదలు కానుంది అని సమాచారం. ఏపీ ప్రభుత్వం అక్కినేని అభిమానులు డిమాండ్ పై ఏ విధంగా స్పందిస్తుందో అన్న విషయంపై అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.