Akhil: సినీ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కినేని నాగేశ్వరరావు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు. నాగేశ్వరరావు లెగసి కంటిన్యూస్ చేస్తూ నాగార్జున ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇక నాగార్జున వారసులుగా నాగచైతన్య అఖిల్ ఇండస్ట్రీలో కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక వీరి వృత్తిపరమైన విషయాలు పక్కన పెట్టి వ్యక్తిగత విషయానికి వస్తే…
అక్కినేని కుటుంబంలో ఇప్పటికే ఎంతోమంది పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకొని విడిపోయిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే నాగచైతన్య కూడా సినీనటి సమంతను పెళ్లి చేసుకొని కొద్ది సంవత్సరాల తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చారు. ఇలా విడాకులు తీసుకొని విడిపోయిన ఎవరైనా వారికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో డిలీట్ చేస్తూ ఉంటారు.
ఈ విధంగా సమంత నాగచైతన్య ఇద్దరు కూడా వారిద్దరికీ సంబంధించిన ఫోటోలను డిలీట్ చేసేసారు కానీ అఖిల్ మాత్రం ఇప్పటికీ కూడా తన ఇంస్టాగ్రామ్ లో సమంత ఫోటోలను అలాగే పెట్టుకోవటం విశేషం. తన అన్నయ్య సమంత విడాకులు తీసుకొని విడిపోయిన అఖిల్ మాత్రం తన మాజీ వదిన ఫోటోని భద్రపరుచుకోవడంతో ఈ ఫోటో కాస్త వైరల్ అవుతుంది. అయితే ఇలా సమంత ఫోటోలను అలాగే పెట్టుకోవడానికి గల కారణం ఏంటని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
సమంత నాగచైతన్య విడిపోయిన అఖిల్ మాత్రం సమంతతో వదిన మరిది రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారా అంటూ పలువురు సందేహాలు వ్యక్తపరచగా మరికొందరు మాత్రం సమంత అఖిల్ చాలా మంచి స్నేహితులని చైతన్య నుంచి సమంత విడిపోయిన అఖిల్ పుట్టినరోజు సందర్భంగా సమంత ఎప్పుడు తనకు విష్ చేస్తూ ఉంటారని ఇలా ఒక బెస్ట్ ఫ్రెండ్ గానే అఖిల్ సమంత ఫోటోని భద్రపరుచుకున్నారని తెలుస్తోంది.