మరోసారి తల్లి కాబోతున్న ప్రపంచం సుందరి..? వైరల్ అవుతున్న ఫోటోలు?

అందాల తార ఐశ్వర్యరాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రపంచ సుందరిగా గుర్తింపు పొందిన ఐశ్వర్య రాయ్ బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్ ని వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. వీరికి ఒక కూతురు కూడా ఉంది. గత కొంతకాలంగా ఐశ్వర్యరాయ్ గురించి బి-టౌన్ లో ఒక వార్త చెక్కర్లు కొడుతోంది. గత కొంతకాలంగా ఐశ్వర్య రాయ్ రెండోసారి తల్లి కాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల బట్ట కూతురితో కలిసి ఐశ్వర్యారాయ్ ముంబై ఎయిర్ పోర్ట్ లో మెరిసింది. దీంతో అక్కడున్న ఫోటోగ్రాఫర్లు వారిని ఫోటోలు వీడియోలు తీశారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో ద్వారా ఐశ్వర్య రెండోసారి తల్లి కాబోతోందని వినిపిస్తున్న వార్తలు మరింత బలమయ్యాయి. అందుకు కారణం ఈ వీడియోలో ఐశ్వర్యరాయ్ చాలా బొద్దుగా పొట్ట భాగంలో కూడా ముందుకు వచ్చినట్టు కనిపిస్తోంది. అంతేకాకుండా ఐశ్వర్యారాయ్ తన పొట్ట భాగాన్ని కనిపించకుండా కవర్ చేయడానికి ప్రయత్నం చేసింది. దీంతో ఐశ్వర్య మరొకసారి ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని నేటిజన్స్ కన్ఫర్మ్ చేశారు. గతంలో పొరపాటు పడ్డ ఈ సారి మాత్రం ఐష్‌ నిజంగానే ప్రెగ్నెంట్‌ అయ్యిందంటూ ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోకు వివిధ రకాల కామెంట్స్ వస్తున్నాయి. 2011 నవంబర్ 16వ తేదీన ఐశ్వర్య దంపతులకు ఆరాధ్య జన్మించింది. ఇప్పుడు ఐశ్వర్య మరొకసారి ప్రెగ్నెంట్ కావటంతో బచ్చన్‌ ఫ్యామిలీ బుల్లి వారసుడు వస్తున్నాడని ఐశ్వర్య అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు తన ప్రెగ్నెన్సీ రూమర్లపై ఐశ్వర్య ఎక్కడ స్పందించలేదు. తన ప్రెగ్నెన్సీ గురించి వస్తున్న వార్తలలో నిజం ఎంత ఉందో తెలియాలంటే ఈ విషయంపై ఐశ్వర్య స్పందించాల్సి ఉంటుంది. ఐశ్వర్యరాయ్ ప్రెగ్నెన్సీ విషయం ఇప్పుడు బీ- టౌన్ లో హాట్ టాపిక్ గా మారింది.