కేన్స్ 2025 ఫిల్మ్ ఫెస్టివల్‌లో బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ బచ్చన్ ప్రత్యేక దృష్టిని ఆకర్షించారు. మణిశ్ మల్హోత్రా డిజైన్ చేసిన ఐవరీ కలర్ బనారసీ చీరలో రాయల్ ఎలిగెన్స్‌ను చూపిస్తూ, ఆమె ఎలివేషన్ అందరినీ మెప్పించింది. రెడ్ కార్పెట్‌పై ఆమె ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈసారి చీర ప్రత్యేకత కన్నా ఆమె సింధూర్ లుక్‌నే ఎక్కువగా చర్చించుకుంటున్నారు. ఆమె తలపై స్పష్టంగా కనిపించే సింధూర్ కొన్ని సందేశాలు ఇస్తోందని అభిమానులు అంటున్నారు.
ఆపరేషన్ సింధూర్ పై దేశమంతా ఏకమైన సమయంలో ఆమె ఈ విధంగా రావడం హైలెట్ అయ్యింది. 51 ఏళ్ల వయసులోనూ స్టైల్, గౌరవం, సంప్రదాయాన్ని సమంగా మిళితం చేసిన ఐష్, గత ఏడాది వచ్చిన విమర్శలకు తగిన సమాధానమిచ్చారు. దేశీయ సంస్కృతిని అంతర్జాతీయ వేదికపై గౌరవంగా చూపించాలన్న ఉద్దేశంతో ఈ బనారసీ చీరను ఎంపిక చేసుకున్నట్లు అనిపించింది. ఐష్ లుక్‌లోని సింధూర్ మాత్రం ఫ్యాషన్ పక్కన పెట్టి ఒక మౌన సందేశంగా మారింది.
ఇదే సమయంలో ఇండియా-పాక్ పరిస్థితులపై జరుగుతున్న చర్చల మధ్య ఈ సింధూర్ ప్రాధాన్యత ప్రత్యేకంగా చెబుతోంది. సామాజిక మాధ్యమాల్లో మాత్రం “సింధూర్ ఓ స్టేట్మెంట్”, “ఆమె ఈ లుక్ ద్వారా దేశీయతను అందరికీ గుర్తు చేసింది” అంటూ కామెంట్లు వస్తున్నాయి. అయినా ఐష్ తాజా లుక్ కేన్స్ ఫెస్టివల్‌లో భారతీయ సంప్రదాయానికి మరోసారి గౌరవం తీసుకొచ్చిందన్నది మాత్రం నిజం.