ప్రస్తుత కాలంలో ఉన్న టెన్షన్లు, వర్క్ ప్రెషర్, ఉరుకుల పరుగుల జీవితం వలన చాలా మంది అనారోగ్య సమస్యల బారినపడుతున్నారు. వాటిలోముఖ్యమైనది వృద్ధాప్య సమస్య . చాలా మందికి చిన్న వయసులోనే వృద్ధాప్య లక్షణాలు కనిపిస్తున్నాయి. వయసు పెరిగేకొద్ది దీర్గకాలిక వ్యాధులు వస్తుంటాయి. ఇలాంటి వయసుకి సంబంధించిన వ్యాదుల నుండి కాపాడుకోవటానికి, మెరుగైన ఆరోగ్యానికి కొన్ని ఔషధాలు మనకు ఉపయోగపడతాయని నిపుణులు ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాం.
వృద్ధాప్య సమస్యలతో బాధపడేవారికి కాఫీ, కొకొవా డ్రింక్స్ ఔషదంగా ఉపయోగపడతాయని నిపుణులు చెపుతున్నారు. న్యూట్రిషన్ అండ్ ఫుడ్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు 10 సంవత్సరాల పాటు దాదాపు 850 మంది పైన పరీక్షలు నిర్వహించిన తర్వాత ఈ విషయాన్ని వెల్లడించారు.
కాఫీ, కొకొవా, మష్రూమ్స్, రెడ్ వైన్ లో పాలిపెనల్ ఎక్కువగా ఉంటుంది. పాలిపెనల్ పుష్కలంగా ఉండే ఫుడ్ వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుందని, దీని వల్ల వృద్ధాప్యం వల్ల వచ్చే సమస్యలను ఈ ఆహారం నియంత్రిస్తుందని పరిశోధకులు చెప్తున్నారు. ప్రతిరోజు కాఫీ కోకోవా తీసుకోవడం వల్ల మన మెదడు చురుకుగా పని చేస్తోంది.ఇదే కాకుండా కాఫీ, కొకొవాతో కిడ్నీలు పనితీరు, గుండె, లివర్ పనితీరుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
కొద్ది మందిలో వయసు పెరిగే కొద్దీ కీళ్ల నొప్పులు కండరాల నొప్పులు వంటి సమస్యలతో పాటు మతిమరుపు సమస్య కూడా పెరుగుతుంది. మతి మరపు సమస్యలు ఉన్నవాళ్ళు ప్రతిరోజు కాఫీ , కోకోవా తీసుకోవటంవల్ల మెదడు చురుకుగా పని చేసి మతిమరపు సమస్యనుండి బయటపడవచ్చును.ఈ విధంగా కాఫీ నుంచి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తరచు కాఫీ తాగటం వల్ల అనేక ఇతర అనారోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది కనుక ప్రతి రోజు రెండు లేదా మూడు కప్పులకు మించి ఈ సందర్భంగా నిపుణులు తెలియజేశారు.