పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో పవర్ స్టార్ అయ్యాడు కానీ రాజకీయాల్లో మాత్రం కమెడియన్ అయ్యాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పవన్ కళ్యాణ్ కంటే కూడా ఎక్కువగా వేరే పార్టీ నాయకులకు ఉపయోగపడుతుంది. 2014 ఎన్నికల సమయంలో టీడీపీకి, ఇప్పుడు బీజేపీకి జనసేన ఉపయోగపడుతుంది. ఈ పొత్తులు పెట్టుకోవడం వల్ల జనసేన ప్రతిసారి నష్టపోతోంది కానీ జనసేన మాత్రం పొత్తుల కోసం ఎదురు చూస్తుంది. పైగా ఎవరన్నా విమర్శిస్తే పొత్తులను సమర్ధించుకుంటుంది. అయితే ఇప్పుడు ఇప్పుడు తిరుపతి ఎన్నికల నేపథ్యంలో టీడీపీ-జనసేనకు ఉన్న బంధం బయట పడిందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి.
జనసేనకు మోసం జరుగుతుందా!!
2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ టీడీపీకి మద్దతు ఇవ్వడం వల్ల ఇప్పటి వరకు వైసీపీ నాయకులు పవన్ టీడీపీకి కట్టు బానిసని అనే వాళ్ళు. అలాగే ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల అసలు ఎన్నికల్లో పోటీ చెయ్యలేకపోతుంది. ఎందుకంటే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో జనసేన, బీజేపీ ఎదగాలనుకుంటున్నారు. అందుకే ఎలాంటి ఎన్నికలు వచ్చినా కూడా తాము పోటీ చేస్తాం తాము చేస్తామని కొట్టుకోవాల్సి వస్తుంది. కానీ ప్రతిసారి బీజేపీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది, జనసేన కేవలం మద్దతు ఇస్తూ ఇంట్లో కూర్చుంటుంది. ఇలా పొత్తుల వల్ల పవన్ కు, జనసేనకు నష్టమే జరుగుతున్నా కూడా పవన్ మాత్రం పొత్తుల కోసం అరులు చాస్తున్నారు.
టీడీపీ-జనసేనల బంధం
టీడీపీ-జనసేనల మధ్యనున్న బంధం గురించి వైసీపీ నాయకులు ఎప్పటి నుండో చెప్తున్నప్పటికి జనసేన మాత్రం ఖండిస్తూనే వచ్చింది. అయితే ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్న తరువాత కూడా టీడీపీ-జనసేన మధ్య నున్న పొత్తు తిరుపతి ఎన్నికల సమయంలో బయటపడింది. తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యాలని జనసేన సిద్ధమైంది. కానీ బీజేపీ జనసేనకు అవకాశం ఇవ్వడం లేదు. దింతో ఏమి చెయ్యాలో అర్ధం కానీ పవన్ చివరికి ఉప ఎన్నికలో మళ్ళీ టీడీపీకి మద్దతు ఇవ్వడానికి సిద్ధం అయ్యారని రాజకీయాలు వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇదే విషయం నిజమైతే పవన్ రాజకీయ భవిష్యత్ ముగిసినట్టే.