ఆలీ తర్వాత అతడికి కీలక పదవి కట్టబెట్టిన వై ఎస్ జగన్.!

ఇప్పుడు ఏపీ వరకు సంబంధించి పలు అంశాలు చాలా రసవత్తరంగా మారుతున్నాయి. ఓ పక్క సినిమాలు అలాగే మరోపక్క రాజకీయాలు కూడా ఒకేలా ఒకే పౌనః పున్యం లో కనిపిస్తున్నాయి. మరి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న శ్రీ వై ఎస్ జగన్ తమ పార్టీ తో అనుకూలంగా ఉన్న సినిమా ప్రముఖులకు అయితే మొదటి నుంచి కూడా తాను ఎలాంటి లోటు చేయలేదు.

ఎవరొకరికి ఏదొక కీలక పదవిలో అయితే నియమించారు. ఇక లేటెస్ట్ గానే ప్రముఖ నటుడు ఆలీ ని ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా వారికి సలహాదారునిగా నియమించగా ఇప్పుడు మరో నటుడు అలాగే తనకి సన్నిహితుడు అయినటువంటి టాలీవుడ్ ప్రముఖులు పోసాని కృష్ణ మురళికి కూడా కీలక పదవి కట్టబెట్టినట్టు టాక్.

మరి జగన్ అయ్యితే పోసానిని ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గా నియమించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనితో ఈ వార్త అటు సినీ సహా రాజకీయయ వర్గాల్లో పలు అంశాల్లో చర్చకు దారి తీసింది. ఇక ఇదిలా ఉండగా ఈ అంశంపై అయితే ఇంకా అధికారిక అనౌన్సమెంట్ కూడా తొందరలోనే రానుంది అని సినీ వర్గాలు చెబుతున్నాయి.