ఆమె ఓ ప్రముఖ సినీ నటి. ఆమె జనసేన పార్టీ వైపు చూస్తోందట. 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి పోటీ చేయాలనే ఆలోచనతో వుందట. ఈ దిశగా ఇప్పటికే జనసేన అధినేతతో ఆమె సంప్రదింపులు జరిపినట్లుగా కూడా తెలుస్తోంది.
సినిమాల్లో అవకాశాలు బాగానే వున్నా, ఎందుకో గ్లామర్ వున్నప్పుడే రాజకీయం కూడా చక్కబెట్టేయాలనే ఆలోచనతో ఆ నటి వుందనే ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఎవరా నటి.? ఈ విషయమై సినీ, రాజకీయ వర్గాల్లో బోల్డన్ని గాసిప్స్ వినిపిస్తున్నాయి.
అయితే, అత్యంత వ్యూహాత్మకంగా.. వ్యవహారం బయటకు లీక్ కాకుండా సదరు నటి, కొన్నాళ్ళ క్రితమే జనసేన అధినేతను కలిశారట. ఓ నిర్మాత, ఓ దర్శకుడు ఈ భేటీలో పాల్గొన్నారని తెలుస్తోంది. ఎన్నికలకు ఇంకా చాలా సమయం వున్నందున, ఇప్పుడే ఈ విషయం బయటకు పొక్కడం మంచిది కాదన్న ఆలోచనతో ఆమె వుందట.
రాజకీయ పార్టీలకు సినిమా గ్లామర్ కొత్తేమీ కాదు. పైగా, సినీ నటి రోజా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మంత్రిగా కొనసాగుతున్నారు. కొన్నాళ్ళ క్రితం సినీ నటి మాధవీ లత, భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసినా, పరాజయం పాలయ్యారు.
సినీ నటి దివ్య వాణి నిన్న మొన్నటిదాకా టీడీపీలో కొనసాగిన సంగతి తెలిసిందే. వాణి విశ్వనాథ్ రాజకీయాల్లోకి వస్తానంటున్నారు. విజయశాంతి ప్రస్తుతం బీజేపీలో యాక్టివ్‌గా వున్నారు. ఆమె గతంలో ఎంపీగా పని చేశారు కూడా.
ఇక, జనసేనలో చేరబోతున్న ఆ నటి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారట.