త‌మిలోళ్ళ‌కు ఇస్మార్ట్ పోరిపై ఇంత ప్రేమ పుట్టుకొచ్చిందేంటి.. ఏకంగా గుడి క‌ట్టి పూజ‌లు చేస్తున్నారు!

చూడ చ‌క్క‌ని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యం నిధి అగ‌ర్వాల్ సొంతం. త‌నలో ఎంతో టాలెంట్ దాగి ఉన్న‌ప్ప‌టికి అది జ‌నాల వ‌ర‌కు రావ‌డానికి చాలా టైం ప‌ట్టింది. పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రంతో నిధి అగ‌ర్వాల్ క్రేజ్ విప‌రీతంగా పెరిగింది. నిధి అగ‌ర్వాల్ కు ఇప్పుడు వీరాభిమానులు త‌యార‌య్యారు. ఎంత‌లా అంటే ఆమెకు గుడులు క‌ట్టి పూజలు చేసే అంత‌లా. మీరు విన్న‌ది నిజ‌మే.. త‌మిళ‌నాడులో వాలంటైన్స్ డే సంద‌ర్భంగా ఆమె అభిమానులు నిధి అగ‌ర్వాల్‌కు గుడి క‌ట్టి పూజ‌లు చేశారు. పాలాభిషేకాలు చేశారు. ఆ త‌ర్వాత కేక్ క‌ట్ చేసి సంబ‌రాలు చేసుకున్నారు.

N | Telugu Rajyam

నిధి అగ‌ర్వాల్ ఫ్యాన్ క్ల‌బ్‌లో ఈ హంగామాకు సంబంధించిన‌ ఫొటోలు పోస్ట్ చేయగా, ఇవి సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. గుడులు క‌ట్టించే అంత అభిమానం సంపాదించుకోవ‌డంతో నిధి అగ‌ర్వాల్ ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. ఈ విష‌యం తెలుసుకున్న‌నిధి కూడా త‌న స‌న్నిహితులందరికి ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ ఫుల్ ఖుష్ అవుతుంద‌ట‌. చాలా త‌క్కువ టైంలో నిధి సంపాదించుకున్న ఈ క్రేజ్ నిజంగా ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంది.

నిధి అగ‌ర్వాల్ సినిమాల‌తోనే కాక సోష‌ల్ మీడియాలోను త‌న అందాల ఆర‌బోత‌కు సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను థ్రిల్ చేస్తూ ఉంటుంది. నిధి గ్లామ‌ర్ షోకు ఫిదా కానివారు లేరంటే అతిశ‌యోక్తి కాదేమో! త‌న‌కు గుడుల క‌ట్ట‌డం విష‌యంపై స్పందించిన నిధి అగ‌ర్వాల్ ఇంత ప్రేమను అస్సుల ఊహించలేదని, జన్మజన్మలకు గుర్తుపెట్టుకుంటానని చెప్పింది.. గతంలో తమిళంలో ఎమ్​జీఆర్, ఖుష్బూ, నమిత, హన్సిక లాంటి పలువురు నటీనటులకు గుడి కట్టారు. ఇప్పుడు నిధి ఆ అద్భుత అవ‌కాశాన్ని అందుకోవ‌డం విశేషం. నిధి తెలుగులోనే కాక త‌మిళంలోను ప‌లు చిత్రాల‌తో సంద‌డి చేస్తుంది. ఈ ఏడాది సంక్రాంతికి నిధి న‌టించిన భూమి ఓటీటీలో విడుద‌ల కాగా, ఈశ్వ‌ర‌న్ థియేట‌ర్‌లో రిలీజైంది. ప్ర‌స్తుతం క్రిష్‌-ప‌వన్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న సినిమాతో బిజీగా ఉంది.

Nn 1 | Telugu Rajyam Nn1 | Telugu Rajyam Nn2 | Telugu Rajyam Nn3 | Telugu Rajyam

 

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles