ఒక్కపూట భోజనం పెట్టిన వ్యక్తిని ఏకంగా హీరోని చేసిన కృష్ణ వంశీ..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శకులుగా మంచి గుర్తింపు పొందారు. ఇలా గుర్తింపు పొందిన వారిలో కృష్ణవంశీ కూడా ఒకరు. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన మురారి, చందమామ, అంతఃపురం,ఖడ్గం సింధూరం వంటి ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఇలాంటి క్లాసిక్ సినిమాలకు కృష్ణవంశీ కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు. అయితే తెలుగులో కృష్ణవంశీ దర్శకత్వం వహించి చాలాకాలం అయింది. ప్రస్తుతం రంగమార్తాండ సినిమాకి కృష్ణవంశీ దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కృష్ణవంశీ ..తనకు ఒక్కపూట భోజనం పెట్టిన వ్యక్తిని హీరోని చేసి రుణం తీర్చుకున్నానని వెల్లడించాడు.

ఈ ఇంటర్వ్యూలో కృష్ణవంశీ మాట్లాడుతూ.. సినిమాల గురించి అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. గతంలో సినిమాలను అవకాశాలు దక్కించుకోవడం కోసం పడిన కష్టాల గురించి కూడా చెప్పుకొచ్చాడు. గతంలో ఒక్క పూట తిండి తినటానికి డబ్బులు లేక పస్తులు ఉన్న రోజులు కూడా ఉన్నాయని ఆయన వెల్లడించారు. డైరెక్టర్ అవ్వకముందు కృష్ణవంశీ ఎన్నో ఆకలి బాధలు అనుభవించినట్లు చెప్పుకొచ్చాడు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గతంలో 5 రోజుల పాటు భోజనం లేకుండా ఉన్నాను. అలాగే మరో 5 నిమిషాలు అయితే పడిపోయే పరిస్థితి. రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై నిల్చుని ఉన్న. ఆకలి బాధ భరించలేక తిరిగి ఊరు వెళ్లిపోదాం అనుకున్నా. కానీ ఊరెళ్లడం అంటే ఓడిపోవడమే. సరిగ్గా ఆ సమయనికి బ్రహ్మజీ వచ్చి భోజనం చేద్దాం రా అన్నాడు. మామలుగా ఎవరైనా అలా రమ్మని అడిగినా నేను వెళ్ళేవాడిని కాదు. కానీ ఆ రోజు ఆకలి నన్ను వెళ్లేలా చేసింది. ఆ రోజు బ్రహ్మజీ పెట్టించిన భోజనం వల్ల నేను ప్రాణాలతో బయటపడ్డాను. భోజనం చేస్తూ అతని రుణం ఎలా తీర్చుకోవాలో అని అనుకున్నా. కానీ డైరక్టర్ అయ్యాక సింధూరం సినిమాలో బ్రహ్మజీని హీరోగా పెట్టీ సినిమా తీసి ఆయన రుణం తీర్చుకున్నా” అంటూ కృష్ణవంశీ వెల్లడించాడు.