కాబోయే వాడు అల చేయటం వల్లే పెళ్ళి క్యాన్సిల్ చేసుకున్న మెహరీన్..మండిపడుతున్న నెటిజన్స్..?

“కృష్ణ గాడి వీరప్రేమగాధ”సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన మెహరీన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆ సినిమాలో తన అందం, అభయంతో తెలుగుపేక్షకులను ఆకట్టుకున్న మెహరీన్… ఆ తర్వాత ఇండస్ట్రీలోని స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు అందుకుంది. ఇలా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే హీరోయిన్గా మంచి గుర్తింపు పొందింది. మహానుభావుడవేరా, ఎఫ్2, ఎఫ్ త్రీ వంటి సినిమాలు మెహరీన్ కెరియర్లో మంచి హిట్ సినిమాలు గా నిలిచిపోయాయి.

ఇదిలా ఉండగా గతంలో మెహరీన్ కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే భవ్య బిష్ణోయ్ అని ప్రముఖ రాజకీయ నాయకుడి కుమారుడితో ఎంగేజ్మెంట్ చేసుకొని అభిమానులకు షాక్ ఇచ్చింది. అయితే ఎంగేజ్మెంట్ జరిగిన కొన్ని రోజుల వ్యవధిలోనే ఎవరు ఊహించని విధంగా తన ఎంగేజ్మెంట్ బ్రేకప్ చేసుకొని పెళ్ళిని క్యాన్సిల్ చేసుకుంది. అయితే మెహరీన్ ఇలా తన పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడానికి అప్పుడు అనేక కారణాలు వినిపించాయి. అయితే తాజాగా మెహరీన్ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోవడానికి గల అసలు విషయం బయటపడింది.

సాధారణంగా పెళ్లయిన తర్వాత కూడా హీరోయిన్లు ఇండస్ట్రీలో కొనసాగాలని ఆశ పడుతూ ఉంటారు. ఈ క్రమంలో కొంతమంది పెళ్లికి ముందే ఈ విషయం గురించి చర్చించుకుని ఒక నిర్ణయానికి వస్తారు. అయితే ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్లు ఇలా సినిమాలలో నటించకూడదు అని కండిషన్ పెట్టడం వల్ల క్యాన్సిల్ చేసుకుని ఇప్పటికీ ఒంటరిగా మిగిలిపోయారు. అయితే మెహరీన్ కూడా తాను పెళ్లి చేసుకోబోయే వ్యక్తితో సినిమాల గురించి పూర్తిగా చర్చించిన తర్వాతే పెళ్లికి సిద్ధపడింది. అయితే ఎంగేజ్మెంట్ తర్వాత అతను మాట మార్చడంతో మెహరీన్ తన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుని ఇప్పటివరకు ఒంటరిగా మిగిలిపోయింది. అయితే కేవలం సినిమాల కోసమే పెళ్లిని రద్దు చేసుకోవడంతో ఆమె చేసిన పిచ్చి పనికి నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.