మరొకసారి మంచి మనసు చాటుకున్న బాలయ్య.. మా బాలయ్య బంగారం అంటున్న అభిమానులు!

balayya-3

నందమూరి తారక రామారావు వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బాలకృష్ణ తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. కొన్ని దశాబ్దాలుగా ఇండస్ట్రీలో హీరోగా రాణిస్తున్న బాలకృష్ణ ఇప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇటీవల బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా బాలయ్య కి కోపం ఎక్కువని, తన అభిమానుల మీద తరచూ చేయి చేసుకుంటూ ఉంటాడని బాలయ్య గురించి వార్తలు వినిపిస్తున్నాయి.

అలా బాలయ్య తన అభిమానుల మీద చేయి చేసుకున్న సంఘటనలు కూడా చాలా వెలుగులోకి వచ్చాయి. అయితే బాలయ్య గురించి పూర్తిగా తెలియని వారు మాత్రమే ఇలా తప్పుగా అర్థం చేసుకుంటారని, బాలయ్య గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తులు ఎవరు కూడా ఆయన గురించి ఇలా తప్పుగా మాట్లాడే అవకాశాలు లేవని ఇప్పటికే ఎంతోమంది అభిమానులతో పాటు దర్శకులు హీరోలు కూడా బాలయ్య గొప్పతనాన్ని వెల్లడించారు. అంతేకాకుండా బాలయ్య ఇప్పటికే ఎంతోమందికి సహాయం చేసి తన మంచి మనసు చాటుకున్నారు.

ఇక ఇటీవల కూడా అనారోగ్యంతో బాధపడుతున్న పేద విద్యార్థికి చికిత్స చేయించే బాధ్యత తీసుకొని మరొకసారి తన మంచి మనసు చాటుకున్నాడు. అనంతపురానికి చెందిన ఒక ఇంటర్ విద్యార్థి చాలా కాలంగా బోన్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోంది. అయితే తల్లిదండ్రులకు అంత ఖర్చు చేసి చికిత్స చేయించి స్తోమత లేదు. ఇక ఇటీవల ఆ విద్యార్థి అనారోగ్యం గురించి తెలుసుకున్న బాలకృష్ణ తన చికిత్సకు సంబంధించిన పూర్తి ఖర్చు తానే భరిస్తానని మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ విద్యార్థికి చికిత్స కూడా ప్రారంభించినట్లు సమాచారం. ఇలా పేద విద్యార్థి పట్ల బాలకృష్ణ తీసుకున్న నిర్ణయం పై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మా బాలయ్య బాబు బంగారం అంటూ కామెంట్లు చేస్తున్నారు.