Maanas: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బిగ్ బాస్ ఫేమ్, నటుడు మానస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ను ప్రారంభించిన మానస్, ఆ తర్వాత సినిమాలలోకి సీరియల్స్ లోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బిగ్ బాస్ షో ద్వారా భారీగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. బిగ్బాస్ షోస్ తర్వాత అతనికి అవకాశాలు మరింత క్యూ కట్టాలి. స్టార్ మా లో ప్రసారం అవుతున్న బ్రహ్మముడి సీరియల్ తో భారీగా గుర్తింపు తెచ్చుకున్నాడని చెప్పాలి.
ఈ సీరియల్ లో హీరో పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సీరియల్ తో పాటు మరికొన్ని సీరియల్స్ లో అలాగే షోలు బాగానే సంపాదిస్తున్నాడు మానస్. ఇదిలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మానస్ మాట్లాడుతూ తన రెమ్యూనరేషన్ గురించి అలాగే ఆస్తిపాస్తుల గురించి తెలిపారు. ఈ సందర్భంగా మానస్ మాట్లాడుతూ.. వైజాగ్ లో తాత, తండ్రుల నుంచి వచ్చిన పొలాలు ఉన్నాయి. వైజాగ్ లో ఒక ఇల్లు ఉంది. హైదరాబాద్ లో మూడు ఫ్లాట్స్ ఉన్నాయి. అలాగే షోకి ఒక రోజుకు లక్ష రూపాయల నుంచి మూడు లక్షల వరకు తీసుకుంటాను.
డైరెక్టర్, నిర్మాణ సంస్థలతో ఉన్న రిలేషన్స్ తో అప్పుడప్పుడు తక్కువకు అడిగినా చేస్తాను. కానీ నా వర్క్ ఎక్కువ ఉంది. డిమాండ్ చేయొచ్చు అంటేనే ఎక్కువ డిమాండ్ చేస్తాను అని చెప్పాడు. కాగా మానస్ షోలు, సీరియల్స్, సిరీస్ లతో నెలలో ఆల్మోస్ట్ 30 రోజులు కూడా బిజీగానే ఉంటాను అని తెలిపారు. మానస్ సీరియల్స్ లో ఎపిసోడ్ కి 25 వేల వరకు తీసుకుంటాడని సమాచారం. మొత్తానికి చేతినిండా పనితో నెలలో 30 రోజులు కష్టపడుతూనే బాగా సంపాదిస్తున్నాడు. అలా మానస్ నెలకు షోలు అలాగే ఇతర ఈవెంట్ల ద్వారా పది నుంచి 15 లక్షల వరకు సంపాదిస్తున్నట్టు తెలుస్తోంది.