Aamir Khan: పాకిస్థాన్ లో దంగల్ సినిమా అందుకే విడుదల చేయలేదు.. అమీర్ ఖాన్ కామెంట్స్ వైరల్!

Aamir Khan: బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇకపోతే అమీర్ ఖాన్ 2016 లో నటించిన సినిమా దంగల్. ఈ సినిమా విడుదల అయ్యి మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పలుదేశాలలో ఈ సినిమాను గ్రాండ్ గా విడుదల చేశారు మూవీ మేకర్స్. ఇకపోతే పాకిస్తాన్‌ లో భారత సినిమాలకు పెద్ద మార్కెట్‌ ఉందన్న విషయం తెలిసిందే.

కానీ దంగల్‌ చిత్రాన్ని మాత్రం పాకిస్తాన్ లో విడుదల చేయలేదు. తాజాగా అందుకు గల కారణాన్ని వివరించారు మూవీ మేకర్స్. రెజ్లర్‌ మహవీర్‌ ఫోగట్‌ జీవిత కథతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 2,070 కోట్లు రాబట్టింది. నితేష్ తివారీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. పాక్‌ లో దంగల్ సినిమా విడుదల కావాలంటే వారు రెండు షరతులు పెట్టారు. మన జాతీయ గీతం, జాతీయ జెండాను మూవీ నుంచి తొలగించాలని అక్కడి ‌ సెన్సార్‌ బోర్డు కోరింది.

నేను అందుకు అంగీకరించలేదు. గీతా ఫోగట్ మ్యాచ్ గెలిచిన సన్నివేశంలో భారత జెండాతో పాటు జాతీయ గీతం ఉంటుంది. వాటిని తొలగిస్తినే ఈ చిత్రానికి అనుమతి ఉంటుందని పాక్‌ సెన్సార్‌ చెప్పింది. దీంతో ఒక సెకను లోపు, మా సినిమా పాకిస్తాన్‌ లో విడుదల కాదని నేను వారికి చెప్పాను. పాకిస్తాన్ విడుదలను రద్దు చేయడం వల్ల తమ వ్యాపారంపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిర్మాతలు నాతో చెప్పారు. అయినప్పటికీ, భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్న దేనికీ మద్దతు ఇవ్వకూడదని స్పష్టంగా ఆరోజే చెప్పాను అని తెలిపారు అమీర్ ఖాన్.