అది లేకుండా ఆది ఏ పని చెయ్యడంటూ ఆది పరువు తీసిన హీరో?

బుల్లితెరపై ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హైపర్ ఆది ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమానికి దూరం అయిన ఈయన శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ వంటి కార్యక్రమాలలో పాల్గొని యధావిధిగా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈవారం ప్రసారం కాబోయే ఢీ ఈ కార్యక్రమానికి సంబంధించిన తాజా ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేజర్ టీమ్ వచ్చినట్టు తెలుస్తోంది. హీరో అడవి శేష్ తో పాటు హీరోయిన్ సాయి మంజ్రేకర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా హైపర్ ఆది మాట్లాడుతూ తనకు ప్రియమనీ నోటి నుంచి ఆ పదం వినాలని ఉంది అంటూ చెబుతాడు. ఏ పదం అని అడగగా..ఓకే.. పండగో.. ఎంజాయో’ అనే పదం వినాలని ఉంది అని చెప్పడంతో ప్రియమణితో పాటు జడ్జీలుగా ఉన్నటువంటి జానీ మాస్టర్ నందితా శ్వేత కూడా ఈ పదం అంటారు. ఇకపోతే యాంకర్ ప్రదీప్ హీరోయిన్ సాయి మంజ్రేకర్ ను కూడా ఈ పదం పలకమని చెబుతాడు.

ఈ క్రమంలోనే హైపర్ ఆది ఓకే.. పండగో.. ఎంజాయో అని చెప్పగా అతను చెప్పిన విధంగానే సాయి మంజ్రేకర్ కూడా పలుకుతారు.ఈ క్రమంలోనే హైపర్ ఆది చెప్పిన విధానం పై అడివి శేష్ స్పందిస్తూ హైపర్ ఆది శృంగారం లేకుండా నార్మల్ గా చెప్పలేవా అంటూ దారుణంగా హైపర్ ఆది పరువు తీశారు. ఈ విధంగా అడివి శేష్ హైపర్ ఆది పై పంచ్ వేయడంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా నవ్వుకున్నారు. ఇకపోతే మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత ఆధారంగా తెరకెక్కిన మేజర్ సినిమా జూన్ 3వ తేదీ విడుదల కావడంతో ఈ చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఈ కార్యక్రమానికి హాజరైనట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం చేసిన సందడి తెలియాలంటే ఈ కార్యక్రమం పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు వేచి చూడాలి.