2019 ఎన్నికల తరువాత టీడీపీ యొక్క కంచుకోటల్లో కూడా వైసీపీలో ఉన్న చిన్న నాయకులు తమ హవాను చూపిస్తున్నారు. అలాగే ఇప్పుడు వైసీపీలో ఉన్న దేవినేని అవినాష్ కూడా టీడీపీ యొక్క కంచుకోటలో తన హవాను చూపిస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రసంశలు పొందుతున్నారు. టీడీపీకి కంచుకోట అయిన విజయవాడ తూర్పులో అవినాష్ తన యొక్క రాజకీయ చతురతను చూపిస్తూ వైసీపీలో ప్రత్యేకమైన నాయకుడిగా ఎదుగుతున్నారు. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి మాత్రం చుక్కలు చూపిస్తున్నారు.
అవినాష్ విషయంలో బాబు తప్పు చేశారు
గతంలో అవినాష్ టీడీపీలో ఉన్నప్పుడు ఆయనకు తగిన గుర్తింపు ఇవ్వడంలో టీడీపీ పెద్దలు విఫలమయ్యారు. ఒక విధంగా ఆయనను తొక్కేయడానికి కూడా టీడీపీ పెద్దలు ప్రయత్నించారు. ఎందుకంటే నారా లోకేష్ కంటే కూడా ఎక్కువ ప్రజాదరణ పొందుతున్నాడే కారణంతో. అలాగే ఎన్నికల సమయంలో కూడా అవినాష్ కు విజయవాడ తూర్పు సీట్ ఇవ్వకుండా గుడివాడ సీట్ ఇవ్వడంతో అక్కడ తన బలగాన్ని ఏర్పాటు చేసుకోవడానికే అవినాష్ కు చాలా సమయం పట్టింది. అవినాష్ లోకేష్ ను డామినేట్ చేస్తున్నాడనే కారణంతో పార్టీలో ప్రాముఖ్యత ఇచ్చేవారు కాదు. ఆయనకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్ష పదవిని కూడా నాన్చి నాన్చి ఇచ్చారని, నిర్ణయాలు తీసుకునే విషయంలోనూ ఆయనకు స్వతంత్రం లేకుండా పోయింది
అవినాష్ కు పూర్తి స్వేచ్ఛను ఇచ్చిన జగన్
టీడీపీలో తనకు కావలసినంత గౌరవం దక్కకపోవడంతో అవినాష్ వైసీపీలో చేరారు. అయితే జగన్ మాత్రం అవినాష్ కు కావలసినంత స్వేచ్ఛ ఇస్తున్నారు. అలాగే పార్టీ మద్దతు కూడా పూర్తిగా ఇస్తున్నారు. వైసీపీలో జగన్ యొక్క అంచనాలను అందుకున్న అతి తక్కువమంది నాయకుల్లో అవినాష్ ఒకరు. టీడీపీ నుండి వైసీపీలోకి వచ్చిన అవినాష్ ఇప్పుడు విజయవాడలో టీడీపీ నాయకులకు చుక్కలు చూపిస్తున్నారు.