ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు జీవన విధానం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల అనేక వ్యాధులు వెంటాడుతున్నాయి. ప్రతిరోజు పిల్లలకు పోషక విలువలు కలిగిన పౌష్టికాహారం ఇవ్వటం ఎంతో అవసరం. ముఖ్యంగా ప్రతిరోజు స్కూల్ కి వెళ్లే పిల్లలకు మంచి ఆహారం అందించాలి. రోజంతా పిల్లలు ఎనర్జిటిక్ గా ఉండటానికి పౌష్టిక ఆహారం చాలా అవసరం. అందువల్ల పిల్లలకు ప్రతిరోజు ఉదయం ఒక గ్లాస్ పాలని తాపిస్తూ ఉంటారు. పాలలో కూడా ఎన్నో పోషక విలువలు ఉంటాయి. కాకపోతే ప్రతిరోజు ఒక గ్లాస్ పాలకి బదులు ఈ స్పెషల్ డ్రింక్ ఇవ్వటం వల్ల పిల్లలకు కావలసిన చెప్పి లభించడమే కాకుండా మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఆ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో? దాని వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఎనర్జీ డ్రింక్స్ తయారు చేసే విధానం :
ఎనర్జీ డ్రింక్స్ తయారు చేయడానికి ఒక గిన్నెలో పదిహేను నల్ల ఎండు ద్రాక్షలు, ఐదు జీడి పప్పులు, ఐదు పొట్టు తొలగించిన బాదం పప్పులు, ఒక గ్లాస్ కాచి చల్లార్చిన పాలు పోసి బాగా కలిపి రాత్రి అంతా నానబెట్టుకోవాలి.ఉదయం పాలతో పాటు నానబెట్టుకున్న ఎండు ద్రాక్షలు, బాదం పప్పులు, జీడి పప్పులను కలిపి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ తేనె కలపటం వల్ల టేస్టీ అండ్ హెల్తీ డ్రింక్ తయారవుతుంది. స్కూల్ కి వెళ్లే పిల్లలకు ప్రతిరోజు వాళ్లకి పాలు బదులు ఈ ఎనర్జీ డ్రింక్ ఇవ్వడం వల్ల పిల్లలు రోజంతా హుషారుగా ఉండటమే కాకుండా మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుంది.
ముఖ్యంగా ఈ ఎనర్జీ డ్రింక్ తాగటం వల్ల పిల్లల్లో రక్తహీనత సమస్య దరిచేరదు. సాధారణంగా పాలలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. పాలతో పాటు డ్రై ఫ్రూట్స్ కలిపి ఎనర్జీ డ్రింక్ తయారు చేయడం వల్ల డ్రై ఫ్రూట్స్ లో ఉండే పోషకాలు కూడా పిల్లలకు అందుతాయి. అందువల్ల ప్రతిరోజు పిల్లలు ఒక గ్లాస్ ఎనర్జీ డ్రింక్ తాగడం వల్ల రోజంతా ఎనర్జిటిక్ గా ఉండటమే కాకుండా అనేక వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి. ఈ ఎనర్జీ డ్రింక్ తాగటం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి రోగాలతో పోరాడుతుంది. అంతేకాకుండా పిల్లల్లో ఎముకలు, కండరాలకు కావలసిన క్యాల్షియం అందించి దృఢంగా ఉండేలా చేసి పిల్లలు ఎదుగుదలకు ఉపయోగపడుతుంది.