Suicide: పెళ్లై ఏడాది కాకుండానే ఆత్మహత్య చేసుకున్న నిండు గర్భిణీ… కారణం అదేనా?

Suicide: పెళ్లయి ఏడాది కూడా కాకుండానే నెల తప్పి ప్రస్తుతం ఏడు నెలల కడుపుతో ఉన్నటువంటి మహిళ త్వరలోనే ఒక పండంటి బిడ్డకు జన్మనిచ్చి తల్లిగా ఆ బిడ్డ ఆలనా పాలన చూసుకోవాల్సింది పోయి తన కన్న తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చిన ఘటన హర్యానాలో చోటుచేసుకుంది.పెళ్లయిన ఏడాది కూడా కాకుండానే అత్తింటి వేధింపులు తట్టుకోలేక వివాహిత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన హర్యానాలో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు…

అంబాలా జిల్లా పింజోర్‌కు చెందిన జలధార, రాజు భార్యాభర్తలు. గత ఏడాదే మే ఐదవ తేదీన వివాహం జరిగింది. వివాహ సమయంలో జలధార తల్లిదండ్రుల స్థోమతకు తగ్గట్టుగా కట్న కానుకలు ఇచ్చి వివాహం చేశారు. పెళ్లి అయిన తర్వాత మరింత కట్నం తేవాలని జలధార అత్త భర్త తనను నిత్యం వేధించసాగాడు. అయితే రాజు ఏ పని చేయకుండా ఇంటిపట్టునే ఉంటూ తన భార్యను మరింత కట్నం తేవాలంటూ చిత్రహింసలకు గురి చేసే వాడు.ఈ విషయం గురించి పెద్దల సమక్షంలో పలుసార్లు పంచాయతీ జరిగిన తన ప్రవర్తనలో ఏ విధమైనటువంటి మార్పు రాలేదు.

భార్య గర్భంతో ఉన్న ఏ మాత్రం తన భర్తలో మార్పు రాకపోవడమే కాకుండా రాజు తనని మరింత వేధించడంతో జలధార పుట్టింటికి వెళ్లి తల్లిదండ్రుల సమక్షంలోనే ఉంది.అయితే తల్లిదండ్రులు తన జీవితానికి అండగా మేమున్నామని పైకి ధైర్యంగా చెబుతున్నప్పటికీ లోపలోపల మాత్రం మదనపడుతున్న విషయాన్ని గమనించిన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.కూలి పనుల నిమిత్తం బయటకు వెళ్లి ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు విగతజీవిగా తమ కూతురు ఉరి కంబానికి వేలాడుతూ కనిపించే సరికి ఆ తల్లి గుండెలవిసేలా రోదించారు.

అయితే జలధార మరణించిన కాసేపటికి తన భర్త రాజు కూడా తన ఇంట్లో ఉరి వేసుకుని మరణించడంతో రెండు కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ క్రమంలోనే పోలీసులు ఈ కేసును నమోదుచేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే అత్తింటి చిత్రహింసల కారణంగానే తన కుమార్తె ఇలా కానరాని లోకాలకు వెళ్లిపోయింది అంటూ జలధార తల్లి కన్నీరు మున్నీరుగా విలపించింది.