Chennai: తొమ్మిది నెలల బిడ్డ ప్రాణాలు కాపాడటం కోసం తెగించిన తల్లి.. ఏకంగా రైలు పట్టాలపై పడుకొని!

Chennai: కొన్నిసార్లు మృత్యువు అంచుకు వచ్చిన మన విధి రాతను బట్టి మనల్ని ఏమీ చేయలేకపోతుంది. ఇలాంటి సందర్భంలో అలా మృత్యువు నుంచి తప్పించుకొని బయటపడిన వారిని మృత్యుంజయులు అంటాము. తాజాగా చెన్నైకి చెందిన 37 సంవత్సరాల యువరాణి అనే మహిళ తన తొమ్మిది నెలల చిన్నారి కూడా మృత్యుంజయులు అని చెప్పవచ్చు. తమిళనాడుకు చెందిన యువరాణి అనే మహిళ రైలు దాటుతుండగా రైలు వేగంగా దూసుకు వచ్చింది అయితే ఈ ప్రమాదం నుండి బయట పడిన ఘటన అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రైల్వే అధికారులు తెలిపిన వివరాల మేరకు..

తమిళనాడులోని కాట్పాడి రైల్వే జంక్షన్‌లో 37 ఏండ్ల యువరాణి, తన 9 నెలల బిడ్డతో రైలు పట్టాలు దాటడం కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఆమె కాలు స్లిప్ అవ్వడంతో రైల్వే పట్టాలపై పడిపోయింది. దీంతో అదే మార్గం గుండా ఎర్నాకులం ఎక్స్ప్రెస్ ప్లాట్ ఫామ్ వద్దకు వేగంగా దూసుకురావడం గమనించిన సిబ్బంది అప్రమత్తమయ్యారు. అయితే రైలు అప్పటికే ఫ్లాట్ ఫామ్ పైకి చేరుకుంది.ఇలా రైలు దూసుకు వస్తున్న సమయంలో యువరాణి ఏ మాత్రం కంగారు పడకుండా ఎంతో చాకచక్యంగా ప్రవర్తించి తన ప్రాణాలను తన బిడ్డ ప్రాణాలను కాపాడుతుంది.

ఈ క్రమంలోనే ఆమె రైలు వస్తుండడం గమనించి రైలు పట్టాల మధ్యలో తన బిడ్డను గట్టిగా పట్టుకుని పడుకుంది. దీంతో ఆమెకు ఎలాంటి ప్రమాదం లేకుండా తల్లి బిడ్డ ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. తల్లి యువరాణికి తలకు కాస్త గాయాలు అయినప్పటికీ బిడ్డ మాత్రం ఎంతో సురక్షితంగా బయటపడింది. ఈ ఘటనను గమనించిన రైల్వే అధికారులు వెంటనే రైలు ఆపడంతో కూడా ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదని చెప్పవచ్చు.ఈ క్రమంలోనే రైల్వే పట్టాల నుంచి తల్లి బిడ్డను బయటకు తీసిన రైల్వే అధికారులు అనంతరం చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.