Chiranjeevi: ఇటీవల అహ్మదాబాద్ లో చోటు చేసుకున్న విమాన ప్రమాదం హృదయ విధారకంగా మారిందని చెప్పాలి. ఎయిర్ పోర్ట్ నుంచి టెకాఫ్ అయిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే సాంకేతిక లోపాలు తలెత్తడంతో ఆవిమానం ఎయిర్ పోర్ట్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక బిల్డింగ్ పైకి కుప్పకూలిపోవడంతో సుమారు 270 మంది వరకు మృతి చెందారని తెలుస్తుంది. ఇక ఈ హృదయ విధారక ఘటన దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని ఎంతగానో కలిసి వేసింది. ఇంత ఘోర ప్రమాదంలో ఒకే ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడటం విశేషం.
ఇలా ఈ విమాన ప్రమాద ఘటనపై ఎంతోమంది సినీ రాజకీయ సెలబ్రిటీలు స్పందిస్తూ సంతాపం తెలియజేస్తున్నారు. అయితే ఇలాంటి విమాన ప్రమాదం నుంచి మెగాస్టార్ చిరంజీవి ఆయన పెద్ద కుమార్తె సుస్మిత తృటిలో తప్పించుకొని బయటపడ్డారని తెలుస్తోంది. అసలు విమాన ప్రమాదం నుంచి వీరు బయటపడటం ఏంటి? అసలేం జరిగింది? అనే విషయానికి వస్తే… ఈ విమాన ప్రమాద ఘటనపై మెగా ప్రదర్శన నాగబాబు స్పందిస్తూ గతంలో తన అన్నయ్య చిరంజీవికి జరిగిన ప్రమాదం గురించి ఆసక్తి కరమైన విషయాలను అందరితో పంచుకున్నారు.
అహమ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ నా మనస్సుని కలచి వేసింది .చాలా సంవత్సరాల క్రితం ఎంతో మంది filmy పర్సనాలిటీస్ ఉన్న చెన్నై ఫ్లైట్ తిరుపతి లో ఎక్కడో ల్యాండ్ అయ్యింది.అందులో మా అందరికీ అత్యంత ప్రియమైన మా అన్నయ్య మా స్వీటీ(సుష్మిత)పాపా ఉన్నారు .ఫ్లైట్ తిరుపతి పొలాల్లో ల్యాండ్ అయ్యిందంట మా…
— Naga Babu Konidela (@NagaBabuOffl) June 12, 2025
చాలా సంవత్సరాల క్రితం చెన్నై నుండి బయలుదేరిన ఒక విమానం తిరుపతి పొలాల్లో ల్యాండ్ అయ్యిందని, అందులో చిరంజీవి, సుస్మిత ఉన్నారని నాగబాబు గుర్తుచేసుకున్నారు. ఆ విమానం ప్రమాదానికి గురైందనే విషయం తెలియటంతో ఒక్కసారిగా ఎంతో ఆందోళన చెందామని అయితే ఆ విమానం పొలాల్లో ల్యాండ్ అవ్వడం వల్ల ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిసి ఊపిరి పీల్చుకున్నామని అప్పటి భయానకర సంఘటనలను గుర్తు చేసుకున్నారు. అయితే ఈ విమానంలో కేవలం చిరంజీవి సుస్మిత మాత్రమే కాకుండా మరి కొంతమంది సినీ సెలబ్రిటీలు కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఇలా ఈ ప్రమాదం నుంచి అందరూ క్షేమంగా బయటపడ్డారని అయితే అదొక భయంకరమైన చేదు జ్ఞాపకంలా మిగిలిపోయిందని తాజాగా నాగబాబు ఈ చేదు జ్ఞాపకాన్ని నెమరు వేసుకున్నారు.