Mudragada: ఎన్ని జన్మలెత్తినా ఆ పని చేయను…. కూతురికి గట్టి షాక్ ఇచ్చిన ముద్రగడ!

Mudragada: ముద్రగడ పద్మనాభం ఇటీవల వైసీపీ పార్టీలోకి చేరడంతో ఈయన కాస్త తరచూ విమర్శలు ఎదుర్కోవడమే కాకుండా వార్తలలో నిలుస్తున్నారు. కాపు ఉద్యమ నేతగా కాపు సామాజిక వర్గం కోసం ఎంతగానో పోరాటం చేసిన ముద్రగడ ఎన్నికల సమయంలో జనసేన పార్టీలోకి వస్తారని అందరూ భావించారు. కానీ ఈయన మాత్రం వైయస్ జగన్మోహన్ రెడ్డి చెంతన చేరడంతో తీవ్ర స్థాయిలో కాపు సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత వచ్చింది. అంతేకాకుండా స్వయంగా తన కుమార్తె క్రాంతి కూడా తన తండ్రికి వ్యతిరేకంగా మారడంతో అప్పట్లో వీరి వ్యవహారం పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచింది.

ఇకపోతే ఇటీవల ముద్రగడ్డ పద్మనాభం క్యాన్సర్ కి గురి అయ్యారని అయినప్పటికీ తన సోదరుడు గిరి తన తండ్రి ఆరోగ్య గురించి పట్టించుకోవట్లేదు అని సరైన చికిత్స కూడా చేయించలేదంటూ ఆరోపణలు చేశారు. ఇక తన తండ్రిని కలవడానికి వెళ్లాలని ప్రయత్నాలు చేసిన ఇంటి దగ్గరకు కూడా రానివ్వట్లేదు అంటూ క్రాంతి ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం తన కూతురు చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. తమ కుటుంబం పై మరొక కుటుంబం గత కొంతకాలంగా దాడి చేస్తున్నారని ముద్రగడ ఆరోపణలు చేశారు.

గత ఏడాది కాలం నుంచి మా ఇంటికి ఆ ఇంటికి రాకపోకలు లేవు అలాంటిది ఉన్నఫలంగా మా ఇంటికి రావాలని ప్రయత్నం వెనుక ఉద్దేశం ఏంటి అని ప్రశ్నించారు.తనకు కాన్సర్ వచ్చిందని.. తన చిన్న కొడుకు పట్టించుకోవడం లేదని తప్పుడు ప్రేలాపన చేస్తున్నారని మండిపడ్డారు. నా కుమారుడి ఎదుగుదలను చూసి కొందరు ఏడుస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో ఎవరో ఏడుస్తున్నారని రాజకీయాలను వదిలిపెట్టను అంటూ రాజకీయాల పరంగా ఈయన క్లారిటీ ఇచ్చారు.

నేను మాత్రమే కాదు నా కొడుకు నా మనవడిని కూడా రాజకీయాలలోకి తీసుకువస్తానని ముద్రగడ తెలిపారు. నేను చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాను తప్ప నాకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని క్లారిటీ ఇచ్చారు. నా భార్య క్యాన్సర్ తో బాధపడుతూ కూతురు ఇంటికి వెళ్లడంతో ఇక్కడికి రా వద్దని తెగేసి చెప్పారు. అప్పుడు లేని ప్రేమలు ఇప్పుడు ఎందుకు వచ్చాయి ఈ ప్రేమలు వెనుక కారణం ఏంటో చెప్పాలని తెలిపారు. నాకు, నా కొడుకుకు మధ్య మనస్పర్థలు పెంచి దూరం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని జన్మలెత్తినా వారి గుమ్మం ఎక్కను.ఎన్ని జన్మలెత్తినా మీకు మాకు సంబంధాలు ఉండవు. అనవసరంగా నా ప్రస్తావన తేవద్దు. సిగ్గు, మర్యాద ఉంటే ఈరోజు నుంచి తప్పుడు ప్రచారం ఆపండిఅని ఘాటు వ్యాఖ్యలు చేశారు.