రౌడీ హీరోతో బాలయ్య మాసివ్ ఎపిసోడ్ అట.!

A Massive Episode With Balayya And Vijay Devarakonda | Telugu Rajyam

నందమూరి వారి నటసింహం నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాత గా తెలుగు స్ట్రీమింగ్ యాప్ “ఆహా” లో ఒక అదిరే టాక్ షో “అన్ స్టాప్పబుల్” చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే ఈ షో లో ఆల్రెడీ రెండు ఎపిసోడ్స్ మోహన్ బాబు ఫామిలీ మరియు లేటెస్ట్ గా నాచురల్ స్టార్ నాని లతో టెలికాస్ట్ కూడా జరిగాయి. ఇక ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే బాలయ్య నెక్స్ట్ ఎపిసోడ్ ఎవరితోనో అన్నది తెలుస్తుంది.

టాలీవుడ్ వన్ అండ్ ఓన్లీ రౌడీ హీరో విజయ్ దేవరకొండ మరియు బాలయ్యలతో ఆహా వారు ఒక మాసివ్ ఎపిసోడ్ ని ప్లాన్ చేశారట. ఇద్దరూ కూడా ఎంత అగ్రెసివ్ నో అందరికీ తెలుసు. అలాంటిది ఇద్దరు కూడా ఒకే స్టేజి మీద అంటే రచ్చ మామూలుగా ఉండదని చెప్పి తీరాలి. అయితే ఇది ఈ నెక్స్ట్ ఎపిసోడ్ గా ఉంటుందా లేక వేరే సమయంలో ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles