Road Accident: రోజురోజుకు రోడ్డు ప్రమాదాల బారిన పడి మరణించిన వారి సంఖ్య అధికమవుతోంది. ఈ క్రమంలోనే ఏదైనా ప్రయాణాలు చేస్తున్న సమయంలో మృత్యువు ఏదో ఒక రూపంలో వెంటాడుతోంది. ఇలా దైవదర్శనం కోసం వెళ్తున్న వారిని మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో బలితీసుకున్న ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది. దైవదర్శనం కోసం కారులో ప్రయాణిస్తున్న వారు అతివేగం కారణంగా కారు చెరువులోకి దూసుకెళ్లిన ఘటన కడపలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…
కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు జిల్లా సింధనూరుకు చెందిన కేదార్ మహంకాళికి రాహు కేతు పూజ చేయించడానికి సిద్ధాంతి చంద్రగుప్తతో కలిసి కాళహస్తికి బయలుదేరారు. ఈ క్రమంలోనే దగ్గరలోనే ఉన్నటువంటి ఒంటిమిట్ట కోదండరాముని దర్శించుకున్న అనంతరం కాళహస్తికి బయలుదేరారు.ఇలా స్వామివారి దర్శనం చేసుకుని బయల్దేరిన ఐదు నిమిషాలకే కారు ఒంటిమిట్ట చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో పాటు కేదార్ మహంకాళి తమ్ముడు ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. మరో ఇద్దరు ప్రాణాలను కోల్పోయారు.
ఈ క్రమంలోనే ఈ సంఘటనను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో గజ ఈతగాళ్లు రంగంలోకి దిగి వారి సహాయంతో కారును తాళ్లతో బయటకు తీసుకొచ్చారు. అయితే అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అతి వేగం కారణంగా కారు చెరువులోకి దూసుకువెళ్లి ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలియజేశారు.