బెజవాడ మేయర్ పీఠం ఆ 27 మందిలో ఎవరిదో ?

ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రావడంతో ప్రస్తుతం మేయర్, డిప్యూటీ మేయర్ పదవులపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నెల 18న మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించిన నేపథ్యంలో పదవుల కోసం పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు గెలిచిన అభ్యర్థులు. ఏకంగా 27 మంది కార్పొరేటర్లు మేయర్ పదవి రేసులో నిలిచారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో 27 మంది మహిళా అభ్యర్థులు విజయం సాధించారు. దీనితో వాళ్లంతా మేయర్ పదవికి అర్హులే. దీంతో కాంపిటీషన్ చాలా సీరియస్ గా నడుస్తోంది.

Vizag south MLA Vasupalli Ganesh effect in YSRCP

సామాజిక సమీకరణాలు, పార్టీ విధేయులు, గతంలో ఇచ్చిన హామీలు ఇలా ఎవరి ఫార్ములా వారు ప్రయోగిస్తున్నారు. మేయర్ రేసులో 34వ డివిజన్ నుంచి విజయం సాధించిన బండి పుణ్యశీల ముందువరుసలో ఉన్నారు. గతంలో కార్పొరేషన్లో వైసీపీ ఫ్లోర్ లీడర్ గా వ్యవహరించిన ఆమె.. మేయర్ గా తనకే అవకాశమివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు మేయర్ పదవిపై సీఎం జగన్ తనకు హామీ ఇచ్చారని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఛైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి కుమార్తె లిఖితారెడ్డి ఓటమి పాలవడంతో పుణ్యశీలకు లైన్ క్లియర్ అయిందని కూడా చెప్తున్నారు.

ఐతే మేయర్ పదవిని వెస్ట్ నియోజకవర్గానికే ఇవ్వాలని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేస్తుండగా.. కాదు సెంట్రల్ నియోజకవర్గానికే కేటాయించాలని బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ మల్లాది విష్ణు కోరుతున్నారు. ఇదిలా ఉంటే విజయవాడ తూర్పు నియోజకవర్గానికి డిప్యూటీ మేయర్ పదవి ఇవ్వాలని ఆ పార్టీ నేత దేవినేని అవినాష్ కోరతున్నారు. పోటీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆశావాహులను బుజ్జగిస్తూనే.. సరైన వ్యక్తిని ఎంపిక చేసేందుకు అధిష్టానం కసరత్తు చేస్తోంది. జి మేయర్ అభ్యర్థి ఎంపికను ఫైనల్ చేసే అవకాశముంది. కాగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం 64 డివిజన్లు ఉండగా.. అందులో 49 డివిజన్లను వైసీపీ కైవసం చేసుకుంది. టీడీపీ 14, సీపీఎం ఒక డివిజన్లో విజయం సాధించాయి.