తెలంగాణ రాష్ర్టంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో కేసీఆర్ సర్కార్ విఫలమైందంటూ ఇప్పటికే ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ఆరోపించాయి. రాష్ర్ట బిజీపీ నేతలు, పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ సైతం ఆదే స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ 14 రోజుల పాటు కనిపించకపోవడంపైనే విమర్శలు వెల్లువెత్తాయి. రాష్ర్టంలో ప్రజల్ని గాలికొదిలేసి కేసీఆర్ ఫామ్ మౌస్ లో గడుపుతు న్నారంటూ విమర్శల పర్వం మొదలైంది. ఆయనకు కరోనా సోకిందా? అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దీంతే కేసీఆర్ శనివారం ప్రగతి భవన్ కు రావడంతో కొన్ని విమర్శలకు పుల్ స్టాప్ పడింది.
అయితే తాజాగా వరంగల్ వచ్చిన బీజేపీ ఎంపీ అరవింద్ కేసీఆర్, ఆయన కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రజలు కష్టాల్లో ఉంటే కేసీఆర్ ఫామ్ హౌస్ లో విశ్రాంతి తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. ఆయన నిర్లక్ష్యం వల్లే కేంద్ర సహాయాన్ని కూడా అందుకోలేకపోతున్నారని మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్ ఆయన చెంచాలు కేంద్రపై అర్ధంలేని ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నో అభివృద్ది పనులు చేస్తుందని…కానీ కేసీఆర్ కథలు పడుతున్నారంటే తూర్పూరా బట్టారు. కేంద్రం 20 లక్షల కోట్ల ప్యాకేజీ అందించింది. కష్టకాలంలో ఇది ఎంతో గొప్ప ప్యాకేజీ. కానీ కేసీఆర్ వాస్తవాలు మాట్లాడటం మానేసి అవాకులు…చెవాకులు పేలుతున్నారని దుయ్యబెట్టారు.
కల్వకుంట్ల కుటుంబానికి ప్రపంచ వ్యాప్తంగా ఆస్తులున్నాయన్నారు. ఆయన సీఎం అయిన తర్వాత మరింత పెరిగాయని ఆరోపించారు. ఓ వైసీని జిన్నాతో పోలుస్తారా? అసలేం మాట్లాడుతున్నారో అర్ధమవుతుందా? అంటూ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ర్టాన్ని హిందు వ్యతిరేకుల చేతిలో పెట్టిండు. ఓవైసీ కేసీఆర్ కి పెద్ద కొడుకులాంటివాడని మండిపడ్డారు.