దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖర్ గురించి ఆయన సతీమణి విజయమ్మ రచించిన `నాలో నాతో వైఎస్సార్` అనే పుస్తకాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. పుస్తకంలో వైఎస్సార్ కు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విశేషాలను విజయమ్మ పంచుకున్నారు. తొలి పలుకులోనే పుస్తక స్వరూపం ఎలా ఉంటుందన్నది విజయమ్మ ఆసక్తికరంగా రివీల్ చేసారు. తాజాగా పుస్తకంలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటుంది. వైఎస్సార్ కుమార్తె షర్మిలకు సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని విజయమ్మ రాసుకొచ్చారు. షర్మిల అమెరికాలో కుటుంబానికి తెలియకుండా బ్రదర్ అనీల్ ను పెళ్లి చేసుకున్నారుట.
ఇద్దరు ప్రేమించుకున్న తర్వాత ఒకరికొకరు అర్ధం చేసుకున్న తర్వాత అమెరికాలోనే వివాహం చేసుకున్నారుట. ఈ విషయం ఎలా? చెప్పాలని సతమతమవుతోన్న సమయంలో చివరికి ధైర్యం చేసి వైఎస్సార్ కు షర్మిల తల్లి సహకారంతో చెప్పేసారుట. దీంతో వైఎస్సార్ ఎలా రియాక్ట్ అవుతారు? కోపగించుకుంటారా? అని షర్మిల చాలా టెన్షన్ పడ్డారుట. కానీ వైఎస్సార్ మాత్రం ఎంత మాత్రం కోపగించుకోలేదుట. కుమార్తె ప్రేమను అర్ధం చేసుకున్నారని విజయమ్మ పుస్తకంలో రివీల్ చేసారు. సహజంగా ఓ కొత్త వ్యక్తి ఇంటికొస్తే ఇబ్బందితో పాటు, తండ్రికి తెలియకుండా పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఫ్రీగా ఉండలేరని భావించి వైఎస్సార్ ఫ్యామిలీ అంతా శ్రీలంక టూర్ వెళ్లారుట.
ఆప్లానింగ్ అంతా వైఎస్సార్ దేనట. ఆ తర్వాత అనీల్ వ్యక్తిత్వం, మిగతా విషయాలపట్ల వైఎస్సార్ కు ఎంతగానో నచ్చాయని తెలిపారు. ఆ ఇష్టంతోనే అనీల్ ని అల్లుడిలా కాకుండా కుమారుడిగా చూసుకునే వారని విజయమ్మ పుస్తకంలో రివీల్ చేసారు. కుమార్తె-అల్లుడి విషయంలో వైఎస్సార్ ఎంత మాత్రం తక్కువ చేయలేదని..కుమారుడి కన్నా ఎక్కువగానే చూసుకునేవారని విజయమ్మ అభిప్రాయపడ్డారు. ఇంకా నాలో నాతో వైఎస్సార్ లో మరెన్నో ఆసక్తికర అంశాల గురించి విజయమ్మ కులంకుశంగా వివరించారు.