Y.S Jagan: వైయస్ జగన్ కు బిగ్ రిలీఫ్… చిక్కుల్లో పడ్డ షర్మిల?

Y.S.Jagan: మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తన చెల్లెలు వైఎస్ షర్మిల మధ్య ఇటీవల కాలంలో ఆస్తి వివాదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సరస్వతి పవర్ భూములలో తనకు వాటా ఉంది అంటూ వైఎస్ షర్మిల ఒకానొక సమయంలో పెద్ద ఎత్తున వాదనలు చేయడమే కాకుండా న్యాయపోరాటం చేశారు అయితే ఈ విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బిగ్ రిలీఫ్ దక్కిందని తెలుస్తుంది.సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ వాటాల బదిలీపై జగన్‌ వేసిన పిటిషన్‌ను అనుమతించింది.విజయలక్ష్మి, షర్మిలకు వాటాలు బదిలీ నిలుపుదల చేయాలని జగన్ పిటిషన్‌ పై విచారణ జరిపిన ధర్మాసనం.. జగన్ వాదనలతో ఏకీభవించింది.

సరస్వతీ పవర్ భూములు వైయస్ జగన్మోహన్ రెడ్డి అయినప్పటికీ వాటిని తన తల్లి పేరు మీదట బదిలీ చేశారు అయితే ఆ ఆస్తులను తన చెల్లెలు షర్మిల గిఫ్ట్ డీడ్ కింద బదిలీ చేయించుకోవాలని చూస్తున్నట్లు ఈ బదిలీలను నిలుపుదల చేయాలి అంటూ జగన్మోహన్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు పిటిషన్ పై విచారణ జరిపి జగన్మోహన్ రెడ్డికి సానుకూలంగా తీర్పు వెల్లడించింది.NCLT తీర్పును విజయమ్మ, షర్మిల హైకోర్టు లో సవాల్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇటీవల కాలంలో వైయస్ షర్మిల తన అన్నయ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పూర్తిస్థాయిలో వ్యతిరేకంగా మారిన సంగతి తెలిసిందే. ప్రతి అంశంలోనూ తన అన్నయ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడేటమే కాకుండా ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేకపోయినప్పటికీ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా షర్మిల వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరును తప్పు పడుతూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇక సరస్వతి పవర్ భూముల విషయంలో వీరి గొడవ తార స్థాయికి చేరిన సంగతి తెలిసిందే అయితే ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డికి భారీ ఊరట లభించింది.