Y S.Jagan: వైయస్ జగన్ ర్యాలీలపై నిషేధం విధించాలి… షర్మిల సంచలన వ్యాఖ్యలు!

Y.S.Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి పై ఇటీవల పలు కేసులు వరుసగా నమోదు అవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి రెంటపాళ్ల పర్యటనలో భాగంగా చోటు చేసుకున్న ఘటన పట్ల ఏపీలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇక ఈ పర్యటనలో భాగంగా జగన్మోహన్ రెడ్డి కారు కిందపడి సింగయ్య అనే కార్యకర్త మరణించినప్పటికీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ విషయాన్ని పట్టించుకోకుండా ప్రజలకు అభివాదం చేస్తూ వెళ్లిపోయారు కేవలం తన బల ప్రదర్శన కారణంగానే ఒక వ్యక్తి బలి అయ్యారు అంటూ జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు వస్తున్నాయి.

ఇక ఈ విషయంపై ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్సార్ షర్మిల సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.. జగన్మోహన్ రెడ్డి బల ప్రదర్శనకు పోలీసులు అనుమతి ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి బిజెపికి దత్తపుత్రుడు అందుకే ఆయనకు అనుమతులు ఉన్నాయి కానీ రాజధాని కోసం, విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఆంధ్ర ప్రజల కోసం పోరాటం చేసే కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఆంక్షలు ఉంటాయి అంటూ విమర్శలు చేశారు.

ఇక జగన్మోహన్ రెడ్డి బల ప్రదర్శనలో భాగంగా సింగయ్య అనే కార్యకర్త మరణిస్తే జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు వెళ్లారని విమర్శించారు. సామాన్య ప్రజల ప్రాణాలు తీసే హక్కు జగన్మోహన్ రెడ్డికి ఎవరు ఇచ్చారు. ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే జగన్మోహన్ రెడ్డికి ర్యాలీ చేయడానికి అనుమతులు ఇవ్వకూడదు అంటూ షర్మిల చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అయితే గత కొంతకాలంగా షర్మిల జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ తరచు వార్తలలో నిలుస్తున్నారు. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను పక్కన పెట్టినప్పటికీ షర్మిల మాత్రం వైయస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయటం అందరిని ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా విమర్శలు పాలు చేస్తుంది.