T.G: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు సంచలనంగా మారాయి. బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవల తన తండ్రి కెసిఆర్ కు రాసిన ఒక లేఖ బహిరంగం కావడంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒక్కసారిగా చర్చలు జరుగుతున్నాయి. బిఆర్ఎస్ పార్టీలో విభేదాలు వచ్చాయని కవితను దూరం పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఈ లేఖ ద్వారా ఆమె చెప్పకనే చెప్పేశారు.
ఇక ఈ లేక గురించి ఇటు కేటిఆర్ కూడా స్పందించారు. మా నాయకుడికి ఎవరైనా ఏదైనా సూచనలు ఇవ్వాలి అనుకుంటే ఇలా లెటర్ రూపంలో కూడా ఇవ్వచ్చని ఆయన తెలిపారు. ఇక కవిత కూడా ఆ లెటర్ నేనే రాసానని మా నాన్న దేవుడని కానీ ఆయన చుట్టూ దయాలు ఉన్నాయి అంటూ ఇటీవల కవిత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇలా కవిత వ్యవహారా శైలి చూస్తుంటే మాత్రం ఈమె అతి త్వరలోనే బిఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టబోతున్నారనే ఊహగానాలు కూడా మొదలయ్యాయి.
ప్రస్తుతం ఏపీలో వైయస్ షర్మిల ఎదుర్కొంటున్న పరిస్థితులను కవిత కూడా ఎదుర్కొంటున్నారని ఈమె మరో షర్మిల కాబోతున్నారంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు కూడా వారి అభిప్రాయాలను తెలుపుతున్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయపరంగా ఎంతో మంచి గుర్తింపు పొందిన నాయకుడు. అయితే తన అన్నయ్య జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కావడం కోసం షర్మిల ఎంతో కష్టపడ్డారు కానీ తన అన్నయ్య అధికారంలోకి వచ్చిన తర్వాత తనని మోసం చేశారంటూ ఈమె ఆరోపణలు చేయడమే కాకుండా ఇప్పుడు తన అన్నయ్యకే పోటీగా నిలిచారు.
ఏపీలో పిసిసి అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకొని తన అన్నయ్య పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తూ ఏకంగా తన అన్నయ్య ఓటమికి కూడా షర్మిల పరోక్షంగా కారణమయ్యారని చెప్పాలి. ఇలా తన అన్నయ్యకు వ్యతిరేకంగా మరొక పార్టీలోకి వెళ్లి ఈమె రాజకీయాల పరంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. భవిష్యత్తులో కవిత పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందని పలువురు వారి అభిప్రాయాలను తెలుపుతున్నారు.