రూ.2.24 లక్షల కోట్ల బడ్జెట్లో ప్రధాన కేటాయింపులు ఇవే 

వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం 2020-21కి గాను వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టింది.  ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో, పిల్లి సుభాష్ చంద్రబోస్ మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టారు.  రూ.2,24,789.18 కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వం బడ్జెట్ రూపొందించింది ప్రభుత్వం.  ఈ బడ్జెట్ ను సంక్షేమ బడ్జెట్ గా వర్ణించారు బుగ్గన.  ఈ బడ్జెట్లో కూడా అత్యధిక మొత్తం సంక్షేమం కోసమే కేటాయించారు.  ఈ మొత్తం బడ్జెట్లో రెవెన్యూ వ్యయం రూ. 1,80,392.65 కోట్లు కాగా మూలధన వ్యయం రూ. 44,396.54 కోట్లు. 
 
ఇక బడ్జెట్లోని కేటాయింపుల విషయానికొస్తే ఈ కింది విధంగా ఉన్నాయి
 
వైఎస్‌ఆర్‌ రైతు భరోసాకు రూ.3,615 కోట్లు 
 
వ్యవసాయానికి రూ.11,891 కోట్లు 
 
వడ్డీ లేని రుణాల కోసం రూ.1,100 కోట్లు
 
ఎస్టీల సంక్షేమానికి రూ.1,840 కోట్లు
 
ధరల స్థిరీకరణ నిధి రూ.3 వేల కోట్లు
 
మైనార్టీ సంక్షేమానికి రూ.1,998 కోట్లు
 
ఎస్సీల సంక్షేమానికి రూ.7,525 కోట్లు 
 
బీసీల సంక్షేమానికి రూ.23,406 కోట్లు 
 
కాపుల సంక్షేమానికి రూ.2,845 కోట్లు
 
విద్యాశాఖకు రూ.22,604 కోట్లు
 
ఆరోగ్యశ్రీకి రూ.2100 కోట్లు
 
వైద్య రంగానికి రూ.11,419 కోట్లు
 
వైఎస్‌ఆర్‌ గృహవసతికి రూ.3వేల కోట్లు
 
బలహీనవర్గాల గృహ నిర్మాణానికి రూ. 150 కోట్లు 
 
డ్వాక్రా సంఘాలకు రూ.975 కోట్లు
 
పీఎం ఆవాజ్‌ యోజన (గ్రామీణం) రూ.500 కోట్లు 
 
పీఎం ఆవాజ్‌ యోజన అర్బన్‌కు రూ.2540 కోట్లు
 
లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ కుంటుపడకుండా చూశామన్న బుగ్గన గత ప్రభుత్వం ఇష్టానుసారంగా ప్రజాధనాన్ని ఖర్చు చేసే విధానాన్ని తమ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించిందని స్పష్టం చేశారు.