తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో, కేసీఆర్ సర్కార్ సరైన టైమ్లో కీలక నిర్ణయం తీసుకుంది. అసలు విషయంలోకి వెళితే.. కరోనా బాదితులకు ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉచితంగా చికిత్స అందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో మొదట 3 ప్రైవేట్ మెడికల్ కాలేజీలను ఎంపిక చేసింది. దీంతో తెలంగాణ సర్కార్ ఎంపిక చేసిన కామినేని, మమత, మల్లారెడ్డి మెడికల్ కాలేజీల్లో కరోనా టెస్టులు ఉచితంగా అందించేలా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ వైద్య శాలలపై తీవ్రమైన వత్తిడి పెరుగుతున్న నేపధ్యంలో, పేదలకు ఉచితంగా కరోనా వైద్యం అందించేందుకు, తెలంగాణ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకోవడం సానుకూల అంశమే అని సర్వత్రా చర్చించుకుంటున్నారు.