జగనన్న చేదోడు.. 247 కోట్లు పంపకానికి సిద్దం 

ఏపీ సీఎం వైఎస్ జగన్ సంక్షేమ పథకాల అమలు విషయంలో అస్సలు వెనకడుగు వేయట్లేదు.  పాలనా పరమైన ఖర్చులకు బడ్జెట్లో లోటు కనబడుతున్నా హామీల అమలులో మాత్రం జాప్యం లేకుండా చూసుకుంటున్నారు.  ఈరోజు బుధవారం రాష్ట్రంలో ఉన్న షాపులున్న 2.47 లక్షల మంది నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లు ఒక్కొక్కరికి 10,000 రూయాల ఆర్థిక సహాయం అందించనున్నారు.  ఇందుకుగాను 247.04 కోట్ల రూపాయల్ని వెచ్చించనున్నారు.  క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు సీఎం. 
 
తమ వాలంటీర్ వ్యవస్థ ద్వారా జిల్లాల వారీగా పూర్తి డేటాను సేకరించింది ప్రభుత్వం.  అధికారిక లెక్కల మేరకు రజకులు (82,347), టైలర్లు (1,25,926) మంది, నాయీ బ్రాహ్మణులు (38,767) మంది ఉన్నారు.  మొత్తం 13 జిల్లాల్లో జిల్లాల వారీగా చూస్తే  విజయనగరం- టైలర్లు(8,669), రజకులు(6,931), నాయీ బ్రాహ్మణులు(2,893)
శ్రీకాకుళంలో టైలర్లు 5,184, రజకులు 7,187, నాయీ బ్రాహ్మణులు 3,355, విశాఖపట్నం- టైలర్లు(11,195), రజకులు(8,319), నాయీ బ్రాహ్మణులు(3,414), పశ్చిమ గోదావరిలో టైలర్లు(10,617), రజకులు(7,214), నాయీ బ్రాహ్మణులు(3,295), కృష్ణా- టైలర్లు(16,656), రజకులు(4,366), నాయీ బ్రాహ్మణులు(3,116) గుంటూరు- టైలర్లు(11,764), రజకులు(2,786), నాయీ బ్రాహ్మణులు(3,030) ప్రకాశం- టైలర్లు(10,472), రజకులు(3,351), నాయీ బ్రాహ్మణులు(2,114) నెల్లూరు- టైలర్లు(9,688), రజకులు(4,902), నాయీ బ్రాహ్మణులు(1,534) వైఎస్సార్- టైలర్లు(5,739), రజకులు(7,399), నాయీ బ్రాహ్మణులు(1,980) కర్నూలు- టైలర్లు(8,863), రజకులు(8,768), నాయీ బ్రాహ్మణులు(4,108),  అనంతపురం- టైలర్లు(4,279), రజకులు(9,417), నాయీ బ్రాహ్మణులు(3,851), చిత్తూరు- టైలర్లు(9,565), రజకులు(3,934), నాయీ బ్రాహ్మణులు(1,992) ఉన్నారు. 
 
వీరందరికీ ఒక్కొక్కరికి 10,000 చొప్పున వారి వ్యక్తిగత ఖాతాల్లో జమచేయనున్నారు.  ఇప్పటికే రైతు భరోసా కింద రైతులకు, వాహనమిత్ర ద్వారా క్యాబ్, ఆటో డ్రైవర్లను ఆదుకున్న సీఎం చెప్పినట్టే తమకు కూడా సహాయం చేయనుండటం ఆనందంగా ఉందని లబ్దిపొందనున్నవారు అంటున్నారు.