కే‌సి‌ఆర్ కే‌టి‌ఆర్ ల తలరాతని మార్చబోతున్న విజయశాంతి ?? ఈ ఒక్క నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ !

 

విజయశాంతి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వక ముందు తెలుగు ప్రజల హృదయాల్లో హీరోయిన్‌గా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న నటి.. ఆ తర్వాత చిత్ర పరిశ్రమను వదిలి రాజకీయాల్లోకి వచ్చిన రాములమ్మకు తెలంగాణ ప్రజలు కూడా బాగానే కనెక్ట్ అయ్యారు.. కాగా విజయశాంతి మొదటిసారిగా బీజేపీ ద్వార రాజకీయ ఆరంగేట్రం చేశారు.. అయితే అప్పటికే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరుగుతున్న పోరాటాలను చూసి చలించి తర్వాత కాలంలో తాను కూడా తెలంగాణ పోరుబాట పట్టారు. ఈ క్రమంలో ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయంగా తల్లి తెలంగాణ పార్టీని స్థాపించారు..

అప్పటికే తెలంగాణ ప్రాంతంలో కేసీఆర్ స్దాపించిన టీఆర్ఎస్ పార్టీ మంచి జోరుమీద ఉంది. ఈ నేపథ్యంలో అనతి కాలంలోనే తన పార్టీని టీఆర్ఎస్‌లో విలీనం చేశారు విజయశాంతి. అయితే కొన్ని రాజకీయ పరిణామాల వల్ల విజయశాంతి టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు.. ఆ తర్వాత సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్ర‌చారానికి విజయశాంతిని స్టార్ క్యాంపెయిన‌ర్‌గా నియ‌మించారు..

 

ఇదే సమయంలో తాము తలిచింది ఒకటైతే దైవం మరొకటి తలిచినట్లుగా తయారైంది కాంగ్రెస్‌ పరిస్థితి. అందువల్ల తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు ఓటమి తప్పలేదు. మరోవైపు పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి రాలేకపోయింది. కనీసం ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయింది.. ఇదిలా ఉండగా పార్టీలో త‌న‌కు ప్రాధాన్యం ఇవ్వ‌క‌పోవ‌డం, టీడీపీ నుంచి వ‌చ్చిన రేవంత్‌రెడ్డి లాంటి వాళ్ల‌కి ప్రాధాన్య‌త‌నిస్తుండ‌టంతో గ‌త కొన్ని నెల‌లు గా రాముల‌మ్మ మ‌న‌స్థాపానికి గుర‌వుతోంద‌నే ప్రచారం సాగుతుంది. అంతే కాకుండా ఆమె పార్టీకి దూరంగా వుంటూ వ‌స్తోంద‌ని విమ‌ర్శ‌లు కూడా వినిపిస్తున్నాయి.

ఇక ప్ర‌స్తుతం హాట్ టాపిక్‌గా దుబ్బాక ఉప ఎన్నిక మారిన నేప‌థ్యంలో దీనిపై జ‌రిగిన చ‌ర్చ‌కు కూడా రాముల‌మ్మ గైర్హాజ‌రు కావ‌డం మరింత ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. ఇక ప్రస్తుతం తెలంగాణాలో జరుగుతున్న రాజకీయపరిణామాలను చూస్తే కేసీయార్ గారు రెండో సారి ముఖ్యమంత్రి పదవిని అదిష్టించిన తర్వాత తెలంగాణా ప్రజలకు పెద్ద పరీక్ష ఎదురైంది. ఎక్కడికక్కడే అభివృద్ధి కుంటుపడింది అనే ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో, టీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుండి క్రమ క్రమంగా వ్యతిరేకత పెరుగుతుందనే వార్త చాపకింద నీరులా బయటకు వస్తుంది..

 

ఇదే సమయంలో రానున్న దుబ్బాక ఉప ఎన్నిక‌లో రాముల‌మ్మ‌ని నిల‌బెట్టాల‌ని ఆలోచిస్తున్నారట. మరి ఈ విషయంలో విజయశాంతి ఇంకా పెదవి విప్పలేదు.. ఒక వేళ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగి ఈ లేడీ అమితాబ్ దుబ్బాక ఉప ఎన్నిక‌ల పోటీలో నిలబడితే, కే‌సి‌ఆర్, కే‌టి‌ఆర్ లకు గట్టి పోటీనిచ్చి వారి తలరాత మార్చుతుందా అని ఆసక్తితో తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారట..