కేసీఆర్ క‌ల‌లుగ‌న్న బంగారు తెలంగాణ ఇదేనా?

తెలంగాణ రాష్ర్ట ముఖ్య‌మంత్రి తెలంగాణ రాష్ర్టాన్ని బంగారు తెలంగాణ‌గా మార్చి చూపిస్తామ‌న్నారు. కానీ మ‌చ్చుకు కూడా రాష్ర్టంలో ఎక్క‌డా అలాంటి ప‌రిస్థితి లేదు. తెలంగాణ ఉద్య‌మం ఊపులో తొలిసారి సీఎం పీఠం ద‌క్కించుకున్నా కేసీఆర్ …రెండ‌వ‌సారి అదే పీఠాన్ని చేజింక్కించుకోవ‌డం కోసం ఎక్కువ‌గానే శ్ర‌మించించాల్సి వ‌చ్చింది. బ‌ల‌హీనంగా ఉన్న ప్ర‌తిప‌క్ష పార్టీ కాంగ్రెస్, ఇత‌ర వామ‌ప‌క్షాల వ్య‌వ‌హారం ఊహించ‌న‌ విధంగా కేసీఆర్ గుండెల్లో రైళ్లు ప‌రిగెట్టించాయి. అందుకే ముందస్తు ఎన్నిక‌ల‌కు వ‌చ్చి కేసీఆర్ సీఎం అయ్యారు. అప్ప‌టికే ప‌రిస్థితులు చేయి దాటిపోతున్నాయ‌ని గ్ర‌హించే కేసీఆర్ తెలివిగా ముంద స్తు ఎన్నిక‌ల‌కు వ‌చ్చార‌న్న‌ది అంద‌రికీ తెలిసిన వాస్త‌వం. ఇక ఆ త‌ర్వాత తెలంగాణ రాష్ర్ట అభివృద్ది కోసం కేసీఆర్ ఇచ్చిన వాగ్ధానాలు…చేసిన ప్ర‌మాణాల గురించి తెలిసిందే.

బంగారు తెలంగాణ సాధించి రాజ‌కీయ చ‌రిత్ర‌లోనే ఓ అధ్యాయంగా నిలిచిపోతా న‌ని చెప్ప‌క‌నే చెప్పారు. కానీ ప్ర‌స్తుత ప‌రిస్థితులు చూస్తుంటే బంగారు తెలంగాణ కాదు…శ‌వాల తెలంగాణ‌లా మార్చేస్తున్న‌ట్లు క‌నిపిస్తుంద‌ని ప్ర‌తిప‌క్షం దుయ్య‌బెట్టింది. క‌రోనా క‌ట్టడి విష‌యంలో ప్ర‌జ‌ల్ని, కేంద్ర ప్ర‌భుత్వాన్ని కేసీఆర్ స‌ర్కార్ ఎలా మోసం చేసిందో? ఇటీవ‌లే ఆధారాల‌తో స‌హా బ‌య‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. గ‌డిచిన మూడు నెల‌ల ప‌రిస్థితి ప‌క్క‌న బెడితే..గ‌త నెల రోజులు హైద‌రాబాద్ సిటీలో ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలిసిందే. ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో క‌రోనాకి స‌రైన వైద్యం అంద‌క ప్రాణాలు విడుస్తున్నారు. డాక్ట‌ర్లు లేరు..న‌ర్సులు లేరు…క‌రోనా కిట్లు లేవు…ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు లేవు. ఇలా ఏమీ లేకుండానే ప్ర‌జ‌ల్ని కాపాడుతున్నామ‌ని కేసీఆర్, కేటీఆర్ ఎలా గొప్ప‌లు చెబుతున్నారో? అన్న‌దానికి మీడియానే సాక్ష్యం. ఆ క‌రోనా చావులకు మీడియానే సాక్ష్యం.

నాన్నా చ‌నిపోతున్నాంటూ ఓ కుమారుడి ఆవేద‌న‌…. ఊపిరి అంద‌డం లేదు..బ్ర‌తికుండ‌గానే గాందీ వైద్యులు ఆక్సిజ‌న్ తీసేసారు. చ‌నిపోతున్నాని చెప్పిన మ‌రో యువ‌కుడు. మరొక‌రు అంబులెన్స్ లో మ‌ర‌ణం.. ఇంకొక‌రు నిండు గ‌ర్భిణీ ప్రాణాలు విచిడిన తీరు చూస్తే క‌డుపు త‌రుక్కుపోతుంది.ప్ర‌భుత్వం ఎంత నిర్ల‌క్ష్యంగా వ‌హిస్తుందో? ఆ మ‌ర‌ణాలు చెబుతున్నాయి. ఆ చావుల‌కు కార‌ణం ప్ర‌భుత్వం కాదు.. సిబ్బంది స‌మ్మెకు దిగ‌డం కార‌ణ‌మంటూ ఎంతో తెలివిగా నెపాన్ని నెట్టే ప్ర‌య‌త్నం చేసారు ప్ర‌భుత్వ డాక్ట‌ర్లు.ఇవ‌న్ని ఒక ఎత్తైనా గ‌త రెండు రోజులు హైద‌రాబాద్ లో కురుస్తోన్న భారీ వ‌ర్షాల‌కు ఉస్మానియా ఆసుప‌త్రి పెద్ద చెరువునే తల‌పించింది.

ఓ ప‌క్క క‌రోనా రోగుల‌తో కిట‌కిట‌లాడుతోంది. ఇంత‌లో భారీ వాన‌..రోగులు ప‌డుకున్న మంచాల క్రింద నుంచి వ‌ర‌ద నీరు పార‌డం. అందులో పీపీఈ కిట్లు కూడా కొట్టుకుపోయాయి. ఇదేం కొత్త కాదు. వందేళ్ల చ‌రిత్ర క‌ల్గిన ఉస్మానియాకి ఇది బాగా అల‌వాటైనదే. వ‌ర్షాలు ప‌డిన‌ప్పుడు నానిపోయి, ఉరుములు ఉరిమిన‌ప్పుడు ఆ శ‌బ్ధానికి ఆసుప‌త్రి గోడ‌లు పెచ్చులుగా ఊడిపోయి రోగుల‌పై ప‌డుతుంటాయి.దీనిపై ఎన్నోసార్లు ఆసుప‌త్రి వ‌ర్గాలు ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. కానీ ఏ ప్ర‌భుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. ఇక కేసీఆర్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఉద్ద‌రిస్తార‌నుకుంటే? అయ‌న గుంపులో గోవింద‌లా ప్ర‌భుత్వాన్ని న‌డిపిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇలాంటి శిథిలావ‌స్త‌కు చేరిన ఆసుప‌త్రిని గాలికొదిలేసి బ‌లంగా ఉన్న స‌చివాల‌యాన్ని కూల్చేసి కొత్త స‌చివాల‌యం నిర్మాణానికి మాత్రం 500 కోట్లు కేటాయించారు కేసీఆర్. మ‌రి ఇదేనా కేసీఆర్ క‌ల‌లు గ‌న్న బంగారు తెలంగాణ‌? ఇదేనా పేద‌ల ప‌ట్ల కేసీఆర్ కు ఉన్నప్రేమ‌, సానుభూతి? అంటూ వామ‌ప‌క్షాలు స‌హా ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు.