మ‌ల‌యాళ చిత్రం ‘అల‌ప్పుళ జింఖానా’ ఇప్పుడు తెలుగులో సోనీ లివ్‌ లో జూన్‌13 నుంచి స్ట్రీమింగ్ కానున్నది

Alappuzha Gymkhana: క‌డుపుబ్బా గ‌ట్టిగా న‌వ్వెందుకు రెడీగా ఉండండి స్పోర్ట్స్‌, కామెడీ, డ్రామా వంటి ఎలిమెంట్స్‌తో థియేట‌ర్స్‌లో ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన‌ మ‌ల‌యాళ చిత్రం ‘అల‌ప్పుళ జింఖానా’ ఇప్పుడు ఓటీటీలో ఆడియెన్స్‌ను అల‌రించ‌టానికి తెలుగు , తమిళ్, కన్నడ మరియు హిందీ భాషల్లో సిద్ధ‌మైంది. ప్ర‌ముఖ ఓటీటీ మాధ్య‌మం సోనీ లివ్‌లోఎక్స్‌క్లూజివ్‌గా జూన్‌13 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

‘అల‌ప్పుళ జింఖానా’ కథలోకి వెళితే, ప్రధాన పాత్రధారి జోజో జాన్సన్ (నస్లెన్), ఓ కాలేజీ విద్యార్థి. ఇతడు ముచ్చట‌ప‌డి త‌న‌కు న‌చ్చిన కాలేజీలోకి స్పోర్ట్స్ కోటా ద్వారా జాయిన్ కావ‌టానికి బాక్సింగ్‌లో చేరతాడు. అయితే కథ అస‌లు మలుపు అక్క‌డే తీసుకుంటుంది అతడు తన స్నేహితులతో కలిసి కఠినమైన, అసలు బాక్సింగ్‌ను నేర్పించే కోచ్ ఆంటోనీ జోషువా (లుక్‌మాన్ అవరాన్)ను కలిసినప్పుడు. పట్టుదల, శ్రమ, బాక్సింగ్‌లో త‌గిలే నిజమైన దెబ్బల గురించి మాట్లాడతాడు. దీని కోసం అత‌ను ఎంచుకున్న షార్ట్ క‌ట్ ప్ర‌యాణంలో త‌న‌ను తాను తెలుసుకుని క‌ష్ట‌ప‌డతాడు. దీంతో ఆ జ‌ర్నీ అత‌నికొక మ‌రుపురానిదిగా మారుతుంది.

ఈ సంద‌ర్భంగా న‌స్లెన్ మాట్లాడుతూ ‘‘అలప్పుళ జింఖానా చిత్రంలో నేను జోజో పాత్రలో నటించటం మంచి అనుభూతినిచ్చింది. ఈ పాత్ర‌లో న‌టించ‌టం ద్వారా నాలోని బ‌ల‌హీన‌త‌లు, బ‌లాల‌ను తెలుసుకోగ‌లిగాను. ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావ‌టం చాలా సంతోషంగా ఉంది. జూన్‌13న సోనీ లివ్ ద్వారా యావ‌త్ దేశం ఈ చిత్రాన్ని వీక్షించ‌నుంది’’ అన్నారు.

ఖలీద్ రెహ్మాన్ దర్శకత్వం వహించటంతో పాటు జాబిన్ జార్జ్, సమీర్ కరాట్, మరియు సుబీష్ కన్నంచేరి క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో నస్లెన్, లుక్‌మాన్ అవరాన్, గణపతి ఎస్. పొడువాల్, సందీప్ ప్రదీప్, అనఘా రవి, ఫ్రాంకో ఫ్రాన్సిస్, బేబీ జీన్, శివ హరిహరన్ తదితరులు నటించారు.క‌థ‌లోని చ‌క్క‌టి కామెడీని, గందరగోళాన్ని బ్యాలెన్స్ చేస్తూ తెర‌కెక్కించిన ఈ చిత్రం అంద‌రినీ అల‌రించింది.

సోనీ లివ్‌లో ‘అల‌ప్పుళ జింఖానా’ చిత్రాన్ని చూడ‌టానికి మీ క్యాలెండ‌ర్‌లో జూన్‌13ను మార్క్ చేసుకోండి.. ఎందుకంటే ఇదొక సినిమాయే కాదు.. న‌వ్విస్తూనే జీవిత పాఠాల‌ను నేర్పిస్తుంది.

అమ్మ మాట - పేరుగు పచ్చడి || Dasari Vignan EXPOSED Amma Mata and Perugu Pachadi Aunty Scams || TR