5000 సంవత్సరాల క్రితం జరిగిన గొప్ప ఇతిహాసం ప్రపంచవ్యాప్తంగా 2.5 బిలియన్ల మంది భక్తికి ప్రతీక నమిత్ మల్హోత్రా ‘రామాయణ’ రెండు భాగాల లైవ్-ఆక్షన్ సినిమాటిక్ యూనివర్స్‌గా, ఇప్పటివరకు రూపొందిన అతి పెద్ద టెంట్‌పోల్ సినిమాల స్థాయిని రీఇమాజిన్ చేయనుంది. ఈ చిత్రం హాలీవుడ్, భారతదేశానికి చెందిన ప్రతిభావంతులను ఒకే వేదికపైకి తీసుకొచ్చే, ఇప్పటివరకు ఎప్పుడూ చూడని గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని అందించబోతోంది.
నితేశ్ తివారీ దర్శకత్వంలో, నమిత్ మల్హోత్రా ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, 8 సార్లు ఆస్కార్ అందుకున్న VFX స్టూడియో DNEG సంయుక్తంగా, యాష్ మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ తో కలిసి నిర్మిస్తున్న రామాయణ, IMAX కోసం చిత్రీకరించబడుతోంది. ఈ చిత్రం పార్ట్ 1 – దీపావళి 2026లో, పార్ట్ 2 – దీపావళి 2027లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
జూలై 3, 2025:
ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సినీ ఈవెంట్ కి నాంది పలికేలా మేకర్స్ ‘రామాయణ: ది ఇంట్రడక్షన్’ పేరిట ఈ ఎపిక్ మూవీని గ్లోబల్‌గా ఆవిష్కరించారు. ఇది పురాణాలలోని రెండు అత్యంత ప్రసిద్ధ శక్తులైన రాముడు vs. రావణ మధ్య కాలాతీత యుద్ధానికి వేదికగా నిలిచింది. ఈ ప్రయోగం ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది ఈ లాంచ్ భారతదేశంలోని తొమ్మిది ప్రధాన నగరాలలో ఫ్యాన్ స్క్రీనింగ్స్ ద్వారా, అలాగే న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ లో భారీ బిల్బోర్డ్ టేకోవర్ ద్వారా వరల్డ్ వైడ్ గా జరిగింది. విజనరీ దర్శక నిర్మాత నమిత్ మల్హోత్రా నేతృత్వంలో, యాష్ సహనిర్మాతగా రూపొందిస్తున్న ఈ రామాయణ… ఆస్కార్ అవార్డు పొందిన సాంకేతిక నిపుణులు, హాలీవుడ్ నిపుణులు, భారతీయ నటీనటులు, కథా కళాకారులను ఒకే వేదికపైకి తీసుకొస్తోంది. ఇది మన నాగరికతలోని అత్యంత శక్తివంతమైన ఇతిహాసాన్ని ఆధునిక సాంకేతికతతో, భారతీయ సంస్కృతి మూలాలపై ఆధారపడిన ప్రపంచస్థాయి సినిమాటిక్ యూనివర్స్‌గా రీడిఫైన్ చేయనుంది.
కథ:
కాలానికి అతీతమైన యుగంలో, ఈ బ్రహ్మాండం సమతుల్యంలో కొనసాగుతోంది . ఈ సమతుల్యాన్ని బ్రహ్మ (సృష్టికర్త), విష్ణు (రక్షకుడు), శివుడు (లయకారుడు) త్రిమూర్తులు కాపాడుతూ ఉంటారు. దేవతలు, ఋషులు, మనుషులు, రాక్షసుల మధ్య సమరసతను ఈ త్రిమూర్తులే నిలుపుతున్నారు. కానీ ఆ సమతుల్యంలోంచి, ఇప్పటివరకు ఎప్పుడూ లేనంతటి ఒక విపరీత శక్తి ఉద్భవిస్తుంది.
ఒక రాక్షస శిశువు, సృష్టిలోనే అత్యంత భయంకరుడు, దుర్జేయుడు అయిన రావణుడిగా మారతాడు. అతని గర్జన ఆకాశాలను కంపింపజేస్తుంది. అతని ఉద్దేశ్యం విష్ణువును నాశనం చేయడం. ఎందుకంటే అతను ఎప్పుడూ తన జాతికి విరోధంగా ఉన్నాడని అతడి నమ్మకం.
అతడిని ఆపేందుకు, విష్ణువు తన బలహీనమైన రూపమైన ఒక మానవ రాజకుమారుడైన రాముడిగా భూమిపై అవతరిస్తాడు.
ఇక్కడినుంచే మొదలవుతుంది శాశ్వత యుద్ధం:
రాముడు vs రావణుడు
మనిషి vs రాక్షసుడు
వెలుగు vs చీకటి
రామాయణం ఒక బ్రహ్మాండ యుద్ధగాధ, శాశ్వత విధి, గొప్ప విజయం — ఇది ఈ రోజుకీ బిలియన్ మందిలో స్పూర్తిని రగిలించేస్తోంది.
నటీనటులు & సాంకేతిక బృందం
భారతదేశపు అగ్రశ్రేణి తారలు రామాయణంలో ప్రధాన పాత్రలుగా నటిస్తున్నారు.
భారతీయ సినిమాలో నాలుగో తరం ఐకాన్ రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తున్నారు.
పాన్ ఇండియా సూపర్‌స్టార్ & సహనిర్మాత యష్ రావణుడిగా
అందరి మనసులను గెలుచుకున్న అభిమాన నటి సాయి పల్లవి సీతగా
హనుమంతుడిగా సన్నీ డియోల్ – లక్ష్మణుడిగా రవి దూబే నటిస్తున్నారు.
ఈ శక్తివంతమైన తారాగణానికి తోడుగా, అద్భుతమైన సాంకేతిక బృందం మద్దతిస్తోంది. తొలిసారి ఆస్కార్ అవార్డు విజేతలు హాన్స్ జిమ్మర్, ఏ.ఆర్. రెహ్మాన్ కలిసి సంగీతం అందిస్తున్నారు. హాలీవుడ్‌లో అగ్రశ్రేణి స్టంట్ డైరెక్టర్లు టెర్రీ నోటరీ (Avengers, Planet of the Apes), గై నోరిస్ (Mad Max: Fury Road, Furiosa) గ్రాండ్ యుద్ధ సన్నివేశాలను రూపొందిస్తున్నారు. ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్లు రవి బన్సాల్ (Dune 2, Aladdin) రాంసే ఏవరీ (Captain America, Tomorrowland ) కలిసి పనిచేస్తున్నారు — ఇది ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ అనుభూతిని అందించనుంది.
నిర్మాత, దర్శకుడు, Prime Focus వ్యవస్థాపకుడు, DNEG CEO అయిన నమిత్ మల్హోత్రా మాట్లాడుతూ..“ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడికీ సంబంధించిన ఒక సాంస్కృతిక ఉద్యమం. రామాయణం ద్వారా మేము కేవలం చరిత్రను తిరిగి చెబుతున్నట్లు కాదు — మేము మన వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాం. ప్రపంచ స్థాయి ప్రతిభను ఒకచోట కలిపి, ఈ కథను నిజమైన భావోద్వేగంతో, నూతనమైన సినిమాటిక్ టెక్నాలజీతో చెప్పగలగడం సాధ్యమవుతోంది. ఇంతకుముందు రామాయణాన్ని ఎన్నోసార్లు చూశాం — కానీ ఈ వెర్షన్‌లో దాని దృశ్యాలు, యుద్ధాలు అన్నీ నిజమైన వైభవం, విస్తృతతతో రీఇమేజిన్ చేయబడుతున్నాయి. భారతీయులైన మనకు ఇది నిజం. ఇప్పుడు ఇది ప్రపంచానికి మనం ఇచ్చే బహుమతి’అన్నారు.
దర్శకుడు నితేశ్ తివారీ మాట్లాడుతూ..రామాయణం అనేది మనందరం చిన్ననాటి నుంచి ఎదిగి విన్న, చూసిన కథ. ఇది మన సంస్కృతికి ఆత్మవంటిది. ఆ ఆత్మను గౌరవించడమే మా లక్ష్యం — అదే సమయంలో ఈ కథకు అర్హమైన సినిమాటిక్ స్థాయిలో ప్రజెంట్ చేయాలనుకున్నాం. ఒక దర్శకుడిగా, ఇది నా కోసం ఒక భారీ బాధ్యత మాత్రమే కాదు — ఓ గౌరవప్రదమైన అవకాశమూ. ఈ కథ ఎందరో తరాలుగా ఎందుకు నిలిచిపోయిందంటే అది మన లోపల వున్న ఒక శాశ్వతమైన, లోతైన భావనను తాకుతుంది. మేము కేవలం ఒక సినిమా తీస్తున్నాం కాదు మేము ఒక దృష్టిని అందిస్తున్నాం. అది భక్తితో పుట్టినదే, శ్రేష్ఠతతో రూపొందించబడింది, మరియు సరిహద్దులను దాటి పోవడానికి రూపొందించబడింది’అన్నారు.
ప్రపంచంలోని అత్యంత విశేష అనుభూతిని ఇచ్చే ఫార్మాట్లలో, ముఖ్యంగా IMAX కోసం రూపొందించబడిన రామాయణ, ప్రేక్షకులను అద్వితీయమైన థియేట్రికల్ అనుభవంలోకి తీసుకెళ్లేలా రూపొందుతోంది. ఇది ఇతిహాసాల్లో ఎన్నటికీ నిలిచిపోయే ఒక మహాకావ్యంలోనికి సినిమాటిక్ ప్రయాణం.
ఈ గ్లింప్స్‌ను ప్రత్యేకంగా మీడియా కోసం హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రీమియర్ చేశారు. అందరూ ఆశ్చర్యపోయేలా, అది అద్భుత అనుభూతిని కలిగించింది. విమర్శకులు దీన్ని ఒక విజువల్ వండర్‌గా ప్రశంసించగా, “ఇలాంటి అనుభవం మేము ఇప్పటివరకు ఎప్పుడూ చూడలేదు” అని అభిప్రాయపడ్డారు.