Ramayana: రామాయణ సినిమాలో లక్ష్మణుడి పాత్రలో నటించినబోయే నటుడు ఎవరో మీకు తెలుసా?

Ramayana: బాలీవుడ్ మూవీ రామాయణ సినిమా గురించి ఎక్కడ చూసినా చర్చించుకుంటున్నారు. నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాముడిగా బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటిస్తుండగా సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రెండు పార్ట్ లుగా రాబోతోంది అన్న విషయాన్ని ఇప్పటికే మూవీ మేకర్స్ ప్రకటించారు. అందులో మొదటి భాగానికి సంబంధించిన షూటింగ్ ని ఇప్పటికే మొదలు పెట్టేశారు. ఈ మొదటి పార్ట్ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి టైటిల్ గ్లీంప్స్ ని కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఈ గ్లింప్స్ కి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ గా స్పందన లభించింది. ఇప్పటివరకు భారతీయ సినిమా ఇండస్ట్రీలో మరే సినిమాకు పెట్టని బడ్జెట్ ని పెడుతున్నారు. 800 కోట్లకు పైగా బడ్జెట్ ని పార్ట్ వన్ కోసం ఖర్చు చేస్తున్నారు మూవీ మేకర్స్. ఇది ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత ఖరీదైన సినిమాగా చెప్పవచ్చు. ఇప్పటికే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. దానికి తోడు ఈ వార్త సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇకపోతే ఈ సినిమాలో పాత్రలో నటించబోయే నటుడికి సంబంధించి ఇప్పుడు ఒక వార్త వైరల్ గా మారింది. అయితే ఈ సినిమాలో లక్ష్మణుడి పాత్రలో నటించబోతున్న నటుడు మరెవరో కాదు బాలీవుడ్ హీరో రవి దూబే.

ఇతను బాలీవుడ్‌ లో కాలా షా కాలా సినిమాతో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చాడు. అంతుకుముందు ఈయన బుల్లి తెరపై సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2006లో స్త్రీ తేరీ కహానీ అనే సీరియల్‌లో రవి పాత్రలో నటించి నటుడిగా ప్రస్థానంను మొదలు పెట్టాడు. కెరీర్‌ ఆరంభం నుంచే బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకొని నటుడిగా తన స్థాయిని పెంచుకుంటూ వచ్చిన రవి దూబే బాలీవుడ్‌ లోనూ ఆఫర్లు సొంతం చేసుకున్నాడు. బుల్లితెర నుంచి వెండితెరపై ఎంట్రీ ఇవ్వాలంటే మంచి పాత్ర కోసం ఎదురు చూశాడు. నటుడిగా తనకు మరింతగా గుర్తింపు తెచ్చి పెట్టే విధంగా లక్ష్మణుడి పాత్రకు ఓకే చెప్పాడు. అయితే బుల్లితెరపై సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఈ నటుడు వెండి తెరపై మొదటి సారి లక్ష్మణుడి పాత్రలో కనిపించబోతున్న నేపథ్యంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఇతడు నిర్మాతగా మంచి విజయాలను సొంతం చేసుకున్నాడు. మరి లక్ష్మణుడి పాత్రలో ఆయన నటన ఏ విధంగా ఉంటుందో ఆయనకు ఏ మేరకు గుర్తింపును తెచ్చి పెడుతుందో చూడాలి మరి.