Akhanda 2: గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, మేకర్ బోయపాటి శ్రీను, #BB4 అఖండ 2 ఫస్ట్ లుక్ & టీజర్

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను హైలీ యాంటిసిపేటెడ్ ‘అఖండ 2: తాండవం’ కోసం నాల్గవ సారి కొలాబరేట్ అయ్యారు. ఈ హై-ఆక్టేన్ సీక్వెల్ కథ, స్కేల్, నిర్మాణం, సాంకేతిక నైపుణ్యం.. ప్రతి అంశంలో అఖండను మించి ఉంటుదని హామీ ఇస్తోంది. ప్రతిష్టాత్మకమైన 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎం. తేజస్విని నందమూరి సగర్వంగా సమర్పిస్తున్నారు.

తాజాగా కర్స్ డబుల్ అప్‌డేట్‌లతో సర్ప్రైజ్ చేశారు. అఖండ 2 ఫస్ట్ లుక్, టీజర్ జూన్ 9న, బాలకృష్ణ పుట్టినరోజుకు ఒక రోజు ముందు విడుదల కానున్నాయి. ఈ పోస్టర్‌లో నంది, డమరుకంతో కూడిన త్రిశూలం కనిపిస్తుంది, దాని నేపథ్యంలో విశ్వ దిక్సూచి ఉంటుంది. ఇది NBK పుట్టినరోజుకు డబుల్ ట్రీట్ అవుతుంది. ఈ పోస్టర్ చాలా క్యురియాసిటీని క్రియేట్ చేస్తోంది.

సినిమా షూటింగ్ షెడ్యూల్ ప్రకారం జరుగుతోంది. టాలీవుడ్ లక్కీ చార్మ్ సంయుక్త ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. డైనమిక్ ఆది పినిశెట్టి ఇంటెన్స్ పాత్రని పోషిస్తున్నారు.

టాప్ టెక్నికల్ టీం ఈ సినిమాకి పని చేస్తోంది. సంగీత సంచలనం S థమన్ సంగీతం అందిస్తున్నారు, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ C రాంప్రసాద్ డీవోపీగా పని చేస్తున్నారు. ఎడిటర్ తమ్మిరాజు. AS ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్.

దసరా కానుకగా సెప్టెంబర్ 25న అఖండ 2 పాన్ ఇండియా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

నటీనటులు: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, సంయుక్త, ఆది పినిశెట్టి

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: బోయపాటి శ్రీను
నిర్మాతలు: రామ్ ఆచంట, గోపి ఆచంట
బ్యానర్: 14 రీల్స్ ప్లస్
సమర్పణ: ఎం తేజస్విని నందమూరి
సంగీతం: థమన్ ఎస్
డీవోపీ: C రాంప్రసాద్, సంతోష్ D Detakae
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కోటి పరుచూరి
ఆర్ట్: ఏఎస్ ప్రకాష్
ఎడిటర్: తమ్మిరాజు
ఫైట్స్: రామ్-లక్ష్మణ్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో