Nari Nari Naduma Murari: చార్మింగ్ స్టార్ శర్వా సంక్రాంతి బ్లాక్ బస్టర్ ‘నారీ నారీ నడుమ మురారి’. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రై. లిమిటెడ్‌తో కలిసి అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించారు. సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటించారు. జనవరి 14న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని సంక్రాంతి విన్నర్ గా నిలిచి హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సంక్రాంతి విన్నర్ బ్లాక్ బస్టర్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకలో టీం అందరినీ షీల్డ్స్ అందించారు.
సంక్రాంతి విన్నర్ బ్లాక్ బస్టర్ ఈవెంట్ లో చార్మింగ్ స్టార్ శర్వా మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. మీడియా మిత్రులకు, ఈ సినిమాని అద్భుతంగా ఆదరించిన ప్రేక్షకులకు, ఈ టైటిల్ ఇచ్చి ముహూర్తం పెట్టిన మా బాలయ్య బాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. నిన్ననే బాలయ్య గారితో మాట్లాడాను. నా పేరు నిలబెట్టావ్ అన్నారు. నెక్స్ట్ సినిమా నుంచి మీరే ముహూర్తం పెట్టాలని అడిగాను. ముందుగా శ్రీ విష్ణు గారికి థాంక్స్. చివర్లో కామియో రోల్ చేయడం శ్రీ విష్ణు గారి గొప్ప మనసు. ఒక హీరో సినిమాని ఫ్రెండ్షిప్ ని నమ్మి చేయడం అనేది మామూలు విషయం కాదు. అనిల్ గారి ప్రొడక్షన్స్ లో మా ఇద్దరికి కలిసి ఒక కథ రాస్తే తప్పకుండా చేస్తాం. చిన్ని గారితో పదేళ్ళ ఏళ్ల అనుబంధం. ఆయనతో సినిమా చేయాలి. కానీ ఆయన రాజకీయాల్లోకి వెళ్లారు. ఆయన ఈ వేడుకకు రావడం ఆనందంగా వుంది. సుదర్శన్ నాకు చాలా మంచి ఫ్రెండ్. ఇందులో తన క్యారెక్టర్ని ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. భాను నందు రైటింగ్ కి చాలా మంచి పేరు వచ్చింది.
వాళ్ళు ఎప్పుడూ ఇలాగే కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాను. రామ్ నెక్స్ట్ జనరేషన్ కి చాలా మంచి డైరెక్టర్ అవుతాడు. జంధ్యాల, ఈవివి గారు తర్వాత ఇప్పుడు అప్ కమింగ్ లో తను ఉన్నాడు. మా కెమెరా మెన్ అద్భుతమైన విజువల్స్ ఇచ్చాడు. మా టీం అందరికీ థాంక్స్. ఈ వేడుకకు విచ్చేసిన వశిష్ట గారికి, త్రినాధ్ గారికి మీడియా మిత్రులకు అందరికీ థాంక్యు. హిట్ వచ్చింది కదా ఎలా ఫీలవుతున్నావ్ అని అడుగుతున్నారు. నిజానికి ఎలా ఫీల్ అవ్వాలి కూడా నాకు తెలియడం లేదు. అందరూ హ్యాపీగా నవ్వుతుంటే చూడడం చాలా బాగుంది. ప్రేక్షకులు గొప్ప విజయాన్ని మాకు ఇచ్చారు. ఈ సినిమా ఎక్కడితో ఆగదు. మరో నాలుగు వారాలు అద్భుతంగా ఆడుతుంది. ఇప్పుడు నుంచి టాక్ స్టార్ట్ అయింది. థియేటర్స్ పెంచాం. ఈ ఫ్రీ డే నుంచి మేమేంటో చూపిస్తాం. అనిల్ గారికి థాంక్స్ చెప్పడం చాలా చిన్న విషయం. హీరో ప్రొడ్యూసర్ కలిసి ఉంటే ఏమవుతుందనేది మేము చూపిస్తాం. నెక్స్ట్ సినిమాకి రూపాయి కూడా అడగను. మళ్ళీ అనిల్ గారు పెద్ద సినిమా చేసే వరకు రూపాయి కూడా తీసుకోను. ఇది నా ప్రామిస్. ఎందుకంటే హిట్ వాల్యూ మాకు తెలుసు. అలాంటి హిట్ ఆయన నాకు ఇచ్చారు. ఆడియన్స్ అందరు కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అందరికీ థాంక్యు సో మచ్.
హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ.. నారీ నారీ నడుమ మురారి సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ చాలా థాంక్స్. ఈ టైటిల్ అనగానే నాకు టెన్షన్ వచ్చింది. బాలయ్య బాబు గారి ప్రతిష్టాత్మకమైన సినిమా అది. అలాంటి టైటిల్ పెట్టాలంటే నిజంగా ధైర్యం ఉండాలి. అనిల్ గారు శర్వా సాయి ఆ ధైర్యం చేశారు. సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ కొట్టారు. అనిల్ గారికి హిట్స్ రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన చాలా మంచి మనిషి. అందరికి బిగ్ కంగ్రాజులేషన్స్.శర్వా నాకు ఎప్పటినుంచో తెలుసు. ఆయన చాలా మర్యాదగా మాట్లాడుతారు. చాలా డిఫరెంట్ కథలు చేస్తారు. ఆయన ప్రతి సినిమాలో ఒక డిఫరెంట్ పాయింట్ ఉంటుంది. ఆయన ప్రతి సంవత్సరం పండగకి రావాలని కోరుకుంటున్నాను. ఆయన వస్తే ప్రతి సినిమా హిట్ అవుతుంది. ఈ వేడుకకు విచ్చేసిన అందరికీ థాంక్యూ.
ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నాకు శర్వాకి ఎప్పటినుంచో స్నేహం ఉంది. అలాగే అనిల్ చిన్నప్పుడు నుంచి మిత్రులు. ఇద్దరు మిత్రులు చక్కటి విజయాన్ని అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. విష్ణు గారి సినిమాలు కూడా చాలా బాగుంటాయి. అనిల్ కి సినిమా అంటే చాలా పాషన్. ఈ సినిమా సాయంత్రం ఆటని ఫ్యామిలీ అంతా కలిసి చూసాం. మొదటి నుంచి చివరిదాకా చాలా ఎంజాయ్ చేశాం. చాలా రోజుల తర్వాత చక్కగా నవ్వుకునే సినిమా చూశాం. ఈ టీం మరిన్ని సక్సెస్ లో అందుకోవాలని కోరుకుంటున్నాను. ఇంత మంచి చిత్రాన్ని అందించిన అందరికీ కూడా అభినందనలు.
ప్రొడ్యూసర్ అనిల్ సంకర మాట్లాడుతూ… అందరికి నమస్కారం. సరిలేరు నీకెవ్వరు సినిమా సక్సెస్ అప్పుడు ఈ షీల్డ్స్ ఇచ్చాము. ఆరేళ్ల తర్వాత మళ్లీ ఈ సక్సెస్ కి షీల్డ్స్ ఇవ్వడమనేది నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఇది అందరూ మెచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాగా ప్రశంసలు అందుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.శర్వా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని మొదటి నుంచి నమ్మకంగా చెప్పారు. ఆ నమ్మకం నిజమైంది. నెక్స్ట్ సంక్రాంతికి ఆయన మళ్లీ వస్తున్నారు. ఆయన రావాలని అందరు కోరుకుంటున్నారు. ఎందుకంటే శర్వా వస్తే ప్రతి సినిమా హిట్ అయిపోతుంది.రైటర్స్ భాను నందు మా జర్నీ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. నరేష్ గారు ఈ సినిమా సామజ కంటే పెద్ద హిట్ అవుతుంది అని చెప్పారు. ఆయన సీన్స్ కి థియేటర్స్ లో పడి పడి నవ్వుతున్నారు. మా డిస్టిబ్యూటర్స్ అందరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. యుఎస్ లో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. విష్ణు కామియో అద్భుతంగా చేశారు. తన డైలాగులకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. డైరెక్టర్ రామ్ తో మళ్లీ చేస్తున్నాం. ఎప్పుడనేది త్వరలోనే చెప్తాం. ఏకే ఎంటర్టైన్మెంట్ టీం నాకు ఎంతో సపోర్ట్ చేశారు . ఈ సినిమా విజయం మా టీం కి అంకితం చేస్తున్నాను. సంక్రాంతి విన్నర్ అని చెప్పడానికి కారణం ఉంది థియేటర్స్ కి వెళ్తే నీకే తెలిసిపోతుంది. ఏ సినిమా అయితే ప్రేక్షకుల్ని ఆనందాన్ని ఇస్తాయో ఆ సినిమాలన్నీ కూడా విన్నర్స్. ప్రతి సంక్రాంతి ఇలా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ విజయంతో మరింత బాధ్యత పెంచుకుని నెక్స్ట్ వచ్చే సినిమా ఇంతకంటే బెటర్ గా ఉండాలని కోరుకుంటున్నాను.
డైరెక్టర్ రామ్ అబ్బరాజు మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. సినిమా అందరూ అద్భుతంగా ఎంజాయ్ చేశారు. ఆడియన్స్ రియాక్షన్స్ చూస్తున్నప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. ఇప్పుడు స్క్రీన్ అన్ని పెరుగుతున్నాయి. ఇది మాకు సెకండ్ రిలీజ్ డేట్ లాగా అనిపిస్తుంది. మళ్ళీ లాంగ్ వీకెండ్ రాబోతుంది. అందరూ కూడా సినిమాని చూడాలని కోరుకుంటున్నాను. మా రైటర్స్ భానునందుకు థాంక్యూ. అద్భుతమైన స్క్రిప్ట్ ఇచ్చారు. నరేష్ గారు క్యారెక్టర్ అద్భుతంగా వర్కౌట్ అయింది. అలాగే సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. మా హీరోయిన్స్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. ఏకే ప్రొడక్షన్స్ అంటే నాకు ఫ్యామిలీ ప్రొడక్షన్ లాంటిది. అనిల్ గారి సపోర్ట్ కి థాంక్యూ. శర్వా గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమా రిలీజ్ తర్వాత ఆయన్ని చూసిన మూమెంట్ ఎప్పటికీ మర్చిపోలేను. అది నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది ఈ అవకాశం ఇచ్చినందుకు థాంక్యూ. శ్రీ విష్ణు గారికి థాంక్ యూ.
పార్వతి లోకేష్ మాట్లాడుతూ.. గత మూడు రోజుల నుంచి ఈ సినిమాని సెలబ్రేట్ చేస్తూనే వున్నాం. నరేష్ గారితో నేను లైఫ్ ని పంచుకుంటున్నాను. ఈ సక్సెస్ ని షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నరేష్ గారు ఎప్పుడు కూడా డైరెక్టర్ ప్రొడ్యూసర్ హీరో గురించి ఆలోచించే నటుడు. అన్ని పాత్రల్లో జీవించాలని ప్రయత్నిస్తారు. ఈ సక్సెస్ లో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. ఈ వేడుకలో అందరికీ షీల్డ్స్ ఇవ్వడమనేది నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.
రాజేష్ దండా మాట్లాడుతూ.. సంక్రాంతికి జనం మెచ్చిన సినిమా నారీ నారీ నడుమ మురారి. తక్కువ థియేటర్స్ లో రిలీజ్ చేశాం. ప్రతిరోజు థియేటర్ కౌంట్ పెరుగుతూ ఉంది. ఈ శుక్రవారం స్క్రీన్స్ అన్ని డబల్ అయ్యాయి. ఈ సినిమా మూడో వారం నాలుగో వారం కూడా మంచి రన్ వస్తుందని ఆశిస్తున్నాను. ఈ శ్రీ విష్ణు గారికి థాంక్యూ. అనిల్ గారు నాకు గురువు లాంటి వారు. ఆయన నన్ను ప్రొడ్యూసర్ని చేశారు. సంక్రాంతి అంటే శర్వా అని మరోసారి ప్రూవ్ చేశారు. నెక్స్ట్ ఇయర్ కూడా స్లాట్ బుక్ చేసుకున్నార. అది కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. 2028 సంక్రాంతికి సామజకి సీక్వెల్ రావాలని కోరుకుంటున్నాను.
డైరెక్టర్ వశిష్ట మాట్లాడుతూ.. ఈ సంక్రాంతి చాలా బాగుంది. మెగాస్టార్ చిరంజీవి గారు బౌండరీ దాటి బ్లాక్ బస్టర్ కొట్టారు. ఆ తర్వాత మిగతా సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. చివర్లో వచ్చిన ఈ సినిమాతో శర్వా మరో సిక్స్ కొట్టి బ్లాక్ బస్టర్ నమోదు చేశారు. ప్రతి సంక్రాంతికి ఆయన సినిమా సూపర్ హిట్ అవ్వాలి. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి కంగ్రాట్యులేషన్స్.
డైరెక్టర్ త్రినాధరావు నక్కిన మాట్లాడుతూ.. సంక్రాంతికి పెద్ద హిట్ కొట్టిన టీమ్ అందరికీ కంగ్రాజులేషన్స్. ఈ సినిమా చూస్తున్నంత సేపు నా సినిమా నేనే చూసుకున్నంత ఆనందంగా అనిపించింది. రైటింగ్ నాకు చాలా నచ్చింది.శర్వా గారు సంక్రాంతి హీరో. ఆయన ఎప్పుడు సంక్రాంతికి వచ్చిన విజయం తథ్యం. ఈ సినిమాలో క్యారెక్టర్స్ అన్నీ కూడా మంచి క్యారెక్టర్స్. అది నాకు చాలా నచ్చింది. శర్వా గారు ఇంతలో అద్భుతంగా ఉన్నారు. చాలా యంగ్ అండ్ ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నారు. అందరికీ కంగ్రాచ్యులేషన్స్. అనిల్ గారి శ్రమకి ఇంత పెద్ద విజయం రావడం నాకు చాలా ఆనందంగా ఉంది.
రామ జోగయ్య శాస్త్రీ మాట్లాడుతూ.. అనిల్ గారి చుట్టూ ఎప్పుడూ కూడా ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది. మంచి రైటింగ్ టీం కుదిరితే సినిమా ఎంత అద్భుతంగా ఉంటుందో నందు భాను రామ్ మరొకసారి నిరూపించారు. సినిమా అద్భుతంగా ఆడుతుంది. థియేటర్స్ పెంచుతున్నారు. సినిమా బ్రహ్మాండంగా దూసుకుపోతోంది. మళ్ళీ అనిల్ గారి ద్వారా బ్రహ్మాండమైన సినిమాలు రావాలని కోరుకుంటున్నాను. ఇంత అద్భుతమైన విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వేడుకలో టీం అందరూ పాల్గొన్నారు.




