14 వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ వేడుకలో ఎదుగుతున్న ఫిలిం మేకర్స్ మేధా శక్తికి వేదికగా మారింది. వీవీ ఆఫ్ కల్చర్ షార్ట్ ఫిలిం ఉత్తమ స్టూడెంట్ షార్ట్ ఫిలింగా అవార్డు గెలుచుకుంది. దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ వేడుక ఇండియాలోనే అత్యంత గుర్తింపు పొందిన సినిమా వేడుక.
వీవీ ఆఫ్ కల్చర్ చిత్రాన్ని సంతోష్ రామ్ మావూరి దర్శకత్వంలో తెరకెక్కింది. ఆయన నెల్లూరుకు చెందిన వ్యక్తి. లాస్ ఏంజిల్స్ లో సంతోష్ ఫిలిం మేకింగ్ లో మాస్టర్స్ చేశారు. ఈ చిత్రంలో చేనేత కార్మికుల వస్త్రాలని, వారి ప్రతిభని క్షుణ్ణంగా చూపించారు. స్పష్టమైన కథాంశం మరియు అద్భుతమైన సినిమాటోగ్రఫీ ద్వారా ఈ చిత్రంలో చేనేత కార్మికుల సంప్రదాయాలని కూడా చూపించారు.
ఈ చిత్ర కథాంశం విషయానికి వస్తే… చేనేత వస్త్రాల తయారీలో ఒక కుటుంభం పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తుంది. కుటుంభ పెద్ద ఆకస్మికంగా మరనించడం, చేనేత చీరలకు ప్రోత్సహం లభించకపోవడంతో ఆయన భార్య కుటుంభ పోషణ కోసం హ్యాండ్ లూమ్ ఫ్యాక్టరీ లో అతితక్కువ వేతనానికి పని చేరుతుంది. ఇంజనీరింగ్ చదువుకుంటున్న తన కుమారుడు విజయ్ ను ఉన్నత చదువుల కోసం అమెరికా పంపాలి అనుకుంటుంది, అందుకు కావాల్సిన డబ్బు కోసం తన ఇంటిని తాకట్టు పెట్టుకొని నగదు ఇవ్వమని ఫ్యాక్టరీ ఓనర్ ను కోరుతుంది., తరువాత ఏం జరిగింది అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుందని దర్శక నిర్మాతలు తెలిపారు.
ఈ చిత్రంలోని స్క్రీన్ ప్లే, సాంకేతిక అంశాలని, అద్భుతమైన మెసేజ్ ని ఫెస్టివల్ జ్యూరీ సభ్యులు అభినందించారు. ఈ చిత్రంతో విద్యార్థుల్లో ఉన్న అద్భుతమైన ప్రతిభ మరోసారి బయటపడింది. ఈ షార్ట్ ఫిలింలో త్యామ్ బకేశ్వర్ రెడ్డి, శ్రావణి లక్ష్మి, సత్యానంద్ నటించారు…. సత్యానంద్ గారు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్, రవితేజ లాంటి వారికి నటనలో శిక్షణ ఇచ్చిన గురువు.