అవార్డ్‌ అంటే ఎంతో ఇష్టం అన్న షారూఖ్‌…!

దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ లో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది.. ఈ అవార్డ్‌ అంటే నాకు ఎంతో ఇష్టమని బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ అన్నారు. దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ 2024 అవార్డుల కార్యక్రమం మంగళవారం రాత్రి ముంబైలో ఘనంగా జరిగింది.

భారత సినీ ప్రముఖులతో పాటు బాలీవుడ్‌ సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో సందడి చేశారు. ఇక ఈ అవార్డుల్లో గత ఏడాది విడుదలైన ‘జవాన్‌’,’యానిమల్‌’ చిత్రాలు పోటీ పడ్డాయి.

‘జవాన్‌’ లో నటనకు గాను ఉత్తమ నటుడిగా షారుక్‌ అవార్డు అందుకోగా.. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన నయనతార ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు. ఇక ‘యానిమల్‌’ సినిమాతో కలెక్షన్ల వర్షం కురిపించిన దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా ఉత్తమ దర్శకుడిగా అవార్డును సొంతం చేసుకున్నారు.