Baby Harika: మెర్సీ కిల్లింగ్ సినిమాలో నటించిన బేబి హారిక కు ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్ !!!

తెలంగాణ ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమకు అందిస్తున్న ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్స్ లో మెర్సీ కిల్లింగ్ సినిమాలో నటించిన బేబి హారికకు ఉత్తమ చైల్డ్ ఆర్టిస్టు కేటగిరిలో గద్దర్ అవార్డ్స్ వరించడం విశేషం.

సాయి సిద్ధార్ద్ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిన సినిమా “మెర్సీ కిల్లింగ్” సాయి కుమార్, పార్వతీశం, ఐశ్వర్య, బేబి హారిక ప్రధాన పాత్రల్లో సిద్ధార్ద్ హరియల, మాధవి తాలబత్తుల నిర్మించిన ఈ సినిమాను శ్రీమతి వేదుల బాల కామేశ్వరి సమర్పించారు. సూరపల్లి వెంకటరమణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు జి.అమర్ సినిమాటోగ్రాఫి అందించగా ఎం.ఎల్.రాజా సంగీతం సమకూర్చారు. గత ఏడాది ఏప్రిల్ 9న థియేటర్స్ లో విడుదలై మంచి విజయం సాధించి ప్రస్తుతం ఆహా ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ సందర్భంగా నిర్మాత శ్రీమతి వేదుల బాల కామేశ్వరి మాట్లాడుతూ… భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఆధారంగా తెరకెక్కిన చిత్రం మెర్సీ కిల్లింగ్ . స్వేచ్ఛ అనే అనాధ బాలిక తనకు న్యాయం జరగాలంటూ ఈ కథ ప్రారంభం అవుతుంది. గత ఏడాది ఏప్రిల్ 12న థియేటర్స్ లో విడుదలై మంచి విజయం సాధించింది. మా సినిమాలో నటించిన బేబి హరికకు గద్దర్ అవార్డ్ రావడం సంతోషంగా ఉంది, సాయి సిద్ధార్ద్ మూవీ మేకర్స్ బ్యానర్ లో మొదటి సినిమాకే ఈ ప్రతిష్టాత్మక అవార్డ్ రావడంతో మా డైరెక్టర్ సూరపల్లి వెంకటరమణ కు ఆలాగే యూనిట్ సభ్యులకు అభినందనలు, మా బ్యానర్ లో మరిన్ని ఆలోచింపజేసే సినిమాలు రాబోతున్నాయని తెలిపారు.

బేబి హారిక మాట్లాడుతూ… ఎమోషనల్ కథ కథనాలను సమాజంలో జరిగే కొన్ని సంఘటనలను తీసుకొని డైరెక్టర్ సూరపల్లి వెంకటరమణ గారు మెర్సీ కిల్లింగ్ సినిమాను తీశారు, నన్ను నమ్మి ఈ సినిమాలో నాకు ప్రధాన పాత్ర ఇచ్చిన డైరెక్టర్ సూరపల్లి వెంకటరమణ గారికి కృతజ్ఞతలు, నాకు నటనలో ఎన్నో మెలుకవలు నేర్పించడమే కాకుండా తనకు కావాల్సిన కంటెంట్ ను నా దగ్గరనుండి రాబట్టుకున్నారు, ఈ గుర్తింపు రావడానికి నాకు దోహదపడ్డారు. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత బాల కామేశ్వరి గారికి కృతజ్ఞతలు, నాకు అవార్డ్ ప్రదానం చేసిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు.

డైరెక్టర్ సూరపల్లి వెంకటరమణ మాట్లాడుతూ… కథను నమ్మి చేసిన సినిమా మెర్సీ కిల్లింగ్. విమర్శకుల ప్రసంశలు పొందిన మా చిత్రానికి గద్దర్ అవార్డ్ రావడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్, టెక్నీషియన్ కు కృతజ్ఞతలు, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన నిర్మాత శ్రీమతి వేదుల బాల కామేశ్వరి గారికి, డాక్టర్ విజయ్ కుమార్ గారికి, సిద్ధార్ద్ హరియల గారికి మాధవి తాలబత్తుల గారికి ప్రేత్యేక కృతజ్ఞతలు. భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు నా దర్శకత్వంలో రాబోతున్నాయి అన్నారు.

రేవంత్ లుచ్చా || KTR Mass Speech after ACB interrogation, Hits Out Revanth Govt || Telugu Rajyam