Balakrishna: తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను ఎంతో ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ గద్దర్ అవార్డు వేడుకలను నిన్న సాయంత్రం హైటెక్ సిటీలో ఎంతో అంగరంగ వైభవంగా జరిపించారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు కూడా ఎన్టీఆర్ నేషనల్ అవార్డును అందజేశారు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులు మీదుగా అవార్డును అందజేశారు.
ఇలా ఈ అవార్డు అందుకున్న అనంతరం బాలకృష్ణ గద్దర్ అవార్డులను తెలంగాణ ప్రభుత్వం ఇవ్వటం చాలా సంతోషకరమని ఇలాంటి గొప్ప నిర్ణయం తీసుకున్నటువంటి తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే వేదికపై ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడారు ఇక డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గురించి మాట్లాడటానికి ముందు ఆయన పేరు మర్చిపోయి బాలయ్య నీళ్లు నమిలారు.
డిప్యూటీ సీఎం అనే విషయం మరిచిపోయి తన శాఖల గురించి మాట్లాడి అనంతరం డిప్యూటీ సీఎం అంటూ పేరు చెప్పకపోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇక డిప్యూటీ సీఎం భట్టి సైతం బాలకృష్ణ తన పేరును మర్చిపోవడంతో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి వైపు చూసి నవ్వుకున్నారు. కాసేపటి తర్వాత తన పేరును గుర్తు చేసుకున్న బాలకృష్ణ తిరిగి తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ ఎన్టీఆర్ పురస్కారాన్ని అందుకోవటంతో అభిమానులందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఈయనకు మూమెంట్ తో పాటు 10 లక్షల రూపాయల ప్రైజ్ మనీ కూడా అందజేశారు. అయితే ఈ ప్రైజ్ మనీ బాలకృష్ణ బసవతారకం ట్రస్ట్ కు విరాలంగా ప్రకటించారు. ఇలా వేదికపై నుంచి ఈ పది లక్షలు బసవతారకం ట్రస్ట్ కు అందచేస్తున్నానని చెప్పడంతో బాలయ్య మంచి మనసుపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.